Telangana: కిటికీలోంచి బయటకు చూశారని విద్యార్థినులను చావబాదిన టీచర్…

ఒకవేళ కిటికీలో నుంచి చూశారే అనుకోండి.. ఇలా గొడ్డును బాదినట్లు బాదాలా..? వేళ్లు విరిగేలా కొట్టాలా..? మరీ ఎంత దారుణం టీచర్ గారూ..! మీ పిల్లల్ని ఎవరైనా కొడితే మీరు ఊరుకుంటారా..? భూపాలపల్లి కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Telangana: కిటికీలోంచి బయటకు చూశారని విద్యార్థినులను చావబాదిన టీచర్...
Class Room

Edited By:

Updated on: Feb 07, 2025 | 7:46 PM

క్లాస్ జరుగుతుండగా.. కిటీకిలో నుంచి చూడటమే వారు చేసిన పాపం. దీంతో ఆ టీచర్‌కు చిర్రెత్తుకొచ్చింది. పిల్లలను విచక్షణారహితంగా కొట్టింది. ఇష్టమొచ్చినట్లు చితకబాదింది. టీచర్ దాడిలో నలుగురు తీవ్రంగా గాయడప్డారు. ఒక విద్యార్థినికి అయితే ఏకంగా చేతి వేలు ఇరగడంతో.. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో ఈ ఘటన జరిగింది. విద్యార్థినిలను కొట్టిన టీచర్‌పై చర్యలు తీసుకుంటామని DEO చెప్పారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా… భూపాలపల్లి కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్‌ కళాశాలలో నైన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థినిలను ఇంగ్లీష్‌ టీచర్‌ సాధ్యం షాన్‌ కర్రతో చితకబాదారు. ఆమె దాడిలో నలుగురు విద్యార్థినులకు గాయాలు కాగా, అందులో ఒకరికి చేతి వేలు విరిగింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబసభ్యులు అమ్మాయిని హాస్సిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ముగ్గురు విద్యార్థినుల చేతులకు ఓ మాదిరి గాయాలు అయ్యాయి.

కిటికీలోంచి చూశామని.. ఎవరో చెబితే కనీసం మా వివరణ వినకుండా ఇంగ్లీష్‌ టీచర్‌ ఇష్టం వచ్చినట్లు కొట్టిందని విద్యార్థినులు చెబుతున్నారు. 9వ తరగతిలో ఉన్న మొత్తం 38 మందిని.. ఇంగ్లీష్‌ టీచర్‌ కొట్టిందని చెబుతున్నారు. ఈ సంఘటన బుధవారం రాత్రి జరగ్గా ఆలస్యంగా బయటకు తెలిసింది. విషయం జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియడంతో.. హాస్టల్‌కు వచ్చి విచారణ చేపట్టారు. టీచర్‌పై చర్యలుంటాయన్నారు.

 మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..