Hyderabad: అర్థరాత్రి పబ్‌లో నుంచి వింత శబ్ధాలు.. పోలీసు దాడిలో విస్తుపోయే వాస్తవాలు!

|

Oct 20, 2024 | 9:38 AM

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ పబ్ అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మెరుపుదాడి చేశారు. పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు.

Hyderabad: అర్థరాత్రి పబ్‌లో నుంచి వింత శబ్ధాలు.. పోలీసు దాడిలో విస్తుపోయే వాస్తవాలు!
Police Raids On Pub
Follow us on

వినోదం ముసుగులో మత్తులకు కేరాఫ్‌గా మారిన పబ్‌లను దారిలో పెట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వరుస దాడులు చేస్తూ.. డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి. ఎవరి ద్వారా కొనుగోలు చేస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. సేకరించిన ఆధారాలతో డ్రగ్స్ ముఠాలను గుర్తించి అరెస్ట్‌ చేసేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.

తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ పబ్ అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మెరుపుదాడి చేశారు. పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా టేల్స్ ఓవర్ స్పిరిట్ పబ్‌ కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పబ్‌కు కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మంది యువతులతో నిర్వాహకులు అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. అశ్లీలంగా డ్యాన్సులు చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు పబ్‌పై కేసు నమోదు చేశారు.

దాడి చేసిన సమయంలో పబ్‌లో మెుత్తం 140 మంది యువతీ యువకులు ఉండగా.. వారందరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరందరికీ నోటీసులు జారీ చేసి వివరాలు సేకరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 40 యువతులను మహిళా పునరావాస కేంద్రానికి తరలిస్తామని పోలీసులు తెలిపారు. పబ్‌లో నిషేధిత డ్రగ్స్ వినియోగిస్తున్నారని ఆరోపణలు రాగా.. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు, గత నెల రోజులుగా వీకెండ్‌లో జరుగుతున్న పార్టీలపై దృష్టి పెట్టారు నార్కోటిక్‌, ఎక్సైజ్‌ అధికారులు. 75 పబ్స్‌లో దాడులు నిర్వహించగా పలువురికి పాజిటివ్ నిర్దారణ అయింది. మరికొన్ని పబ్స్‌లో నకిలీ ఆధార్లతో పబ్‌లకు వెళ్తున్న మైనర్ల వ్యవహారం బయటపడింది. దీంతో నార్కోటిక్, ఎక్సైజ్ అధికారులు దాడులు ముమ్మరం చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..