Son beats father to death: మెదక్​ జిల్లాలో ఘోరం.. మద్యానికి డబ్బు ఇవ్వలేదని తండ్రిని కొట్టి చంపిన కొడుకు

|

Oct 24, 2021 | 11:50 AM

వ్యసనం మనిషిని ఎంతవరకూ దిగజారుస్తుందనే దానికి మరో తార్కాణమిది. మద్యానికి బానిసై డబ్బు కోసం కనిపెంచిన సొంత తండ్రినే అత్యంత

Son beats father to death: మెదక్​ జిల్లాలో ఘోరం.. మద్యానికి డబ్బు ఇవ్వలేదని తండ్రిని కొట్టి చంపిన కొడుకు
Follow us on

Son beats father to death: వ్యసనం మనిషిని ఎంతవరకూ దిగజారుస్తుందనే దానికి మరో తార్కాణమిది. మద్యానికి బానిసై డబ్బు కోసం కనిపెంచిన సొంత తండ్రినే అత్యంత కిరాతకంగా చంపేశాడో కొడుకు. మెదక్​ జిల్లా పెద్ద శంకరంపేట మండలం కోలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో సదరు కుమారుడు తండ్రిని కొట్టి చంపేశాడు.

వివరాల్లోకి వెళితే, రోమాల సాయిలు (50) కోలపల్లి గ్రామంలో నివాసిస్తున్నాడు. అతని కుమారుడు అనిల్ నిత్యం మద్యం తాగేందుకు అలవాటు పడ్డాడు. తరచూ మద్యం తాగుతూ… డబ్బుల కోసం తండ్రిని వేధించే వాడు. ఈ క్రమంలోనే రాత్రి అనిల్ తాగి ఇంటికి వచ్చి.. తండ్రిని డబ్బులు కావాలని అడిగాడు.

తాగడానికి సొమ్ములిచ్చేందుకు తండ్రి నిరాకరించారు. డబ్బుల్లేవని నాన్న సమాధానమివ్వడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అనిల్.. మద్యం మత్తులో తండ్రిని కొట్టి చంపేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అనిల్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.

Read also: Drugs: పోలీస్ అప్పీల్.. గంజాయి, గుట్కా, జర్దా, మారక ద్రవ్యాలు అమ్మితే సమాచారం ఇవ్వండి