Supreme Court – Telangana: ఆ విషయంలో తెలంగాణ సర్కార్‌పై సుప్రీంకోర్టు అసహనం.. 2 వారాల డెడ్‌ లైన్ విధింపు..!

|

Jun 07, 2022 | 6:17 PM

Supreme Court - Telangana: తెలంగాణ సర్కార్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో..

Supreme Court - Telangana: ఆ విషయంలో తెలంగాణ సర్కార్‌పై సుప్రీంకోర్టు అసహనం.. 2 వారాల డెడ్‌ లైన్ విధింపు..!
Supreme Court
Follow us on

Supreme Court – Telangana: తెలంగాణ సర్కార్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో నిబంధనల ఉల్లంఘనలకు గానూ విధించిన రూ 2.50 లక్షల జరిమానా చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, ఏపీ సర్కార్ ఈ ఫైన్ మొత్తాన్ని చెల్లించగా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం చెల్లించకపోవడంతో ధర్మాసనం క్వశ్చన్ చేసింది. కోర్టు ఉత్తర్వులను తెలంగాణ సర్కార్ పాటించలేదని అసహనం వ్యక్తం చేసింది. అయితే, కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందునే జరిమానా చెల్లించలేదని ధర్మాసనానికి సమాధానం ఇచ్చారు. కాగా, ఈ వివరణకు స్పందించిన కోర్టు.. జరిమానా చెల్లించేందుకు మరో 2 వారాలు గడువు ఇచ్చింది. ఈ గడువులోగా జరిమానా చెల్లించకుంటే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం.

ఇంతకీ వివాదం ఏంటంటే..
ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ పోస్టులన్నీ ఎస్టీలకే కేటాయిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు నియామకాలు కూడా చేపట్టింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవగా.. విచారణ జరిగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చిన సుప్రీం ధర్మాసనం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రెండున్నర లక్షల రూపాయలు చొప్పున జరిమానా విధించింది. ఈ జరిమానాను ఏపీ సర్కార్ చెల్లించగా.. తెలంగాణ మాత్రం చెల్లించలేదు. ఇదే అంశంపై ఇవాళ కోర్టులో విచారణ జరిగింది.