Telangana: విద్యార్థులే సాప్ సపాయి చేసుకోవాల్సిందే.. కాదు కూడదంటే పస్తులే.. ఎక్కడే తెలుసా?

షెడ్యూల్ వర్గానికి చెందిన పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల హాస్టల్ ఎలా ఉండకూడదో భైంసాలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం చూస్తే తెలిసిపోతుంది. హాస్టల్లోని ఏ రూం చూసినా దుర్గంధాన్ని వెదజల్లుతోంది. బెడ్ ల పక్కన పాన్ పరాకులు ఉమ్మేసిన మరకలు దర్శనమిస్తున్నాయి. ఇక్క బాత్‌రూమ్‌ల పరిస్థితి చెప్పనక్కర్లేదు.

Telangana: విద్యార్థులే సాప్ సపాయి చేసుకోవాల్సిందే.. కాదు కూడదంటే పస్తులే.. ఎక్కడే తెలుసా?
Bhainsa Hostel

Edited By: Balaraju Goud

Updated on: Feb 13, 2025 | 4:18 PM

ప్రభుత్వ హాస్టళ్ళు నరక కూపాలను తలపిస్తున్నాయి. వీటికంటే జైళ్లే నయం అనేలా దర్శనమిస్తున్నాయి. చుట్టూ దుర్గందం.. బెడ్ల పక్కనే గుట్కా మరకలు.. పడుకునేందుకు కనీసం చోటు లేని బెడ్లు.. చిరిగిపోయిన దుప్పట్లు.. విరిగిపోయిన బల్లలు.. అస్సలు కనిపించని శుచి శుభ్రత..! వీటికంటే మరుగుదొడ్లు నయం అనేలా కనిపిస్తున్నాయి అక్కడి దృశ్యాలు. ఇంత దారుణమా ఇంత అన్యాయమా అనిపించేలా దర్శనమిస్తున్న ప్రభుత్వ బాలుర హస్టళ్ళను‌ చూడాలంటే నిర్మల్ జిల్లా బైంసాకు వెళ్లాల్సిందే..! అక్కడి విద్యార్థుల గోడు తెలుసుకోవాల్సిందే..

షెడ్యూల్ వర్గానికి చెందిన పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల హాస్టల్ ఎలా ఉండకూడదో భైంసాలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం చూస్తే తెలిసిపోతుంది. హాస్టల్లోని ఏ రూం చూసినా దుర్గంధాన్ని వెదజల్లుతోంది. బెడ్ ల పక్కన పాన్ పరాకులు ఉమ్మేసిన మరకలు దర్శనమిస్తున్నాయి. ఏడాది కాలంగా గోడలను క్లీన్ చేసి రంగులు వేయించాలని విద్యార్థులు వేడుకున్న ఫలితం కనిపించలేదు‌‌సరి కదా.. ప్రశ్నించిన విద్యార్థులకు ఆ పూట పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బెడ్లు సరిగాలేక ఇరుకిరుకు గదుల్లో నిద్ర పట్టక నరకం చూడాల్సి‌న పరిస్థితి విద్యార్థులది. ఇక వంటగదులు అయితే మరింత అధ్వాన్నం. గదులే ఈ విధంగా ఉంటే బాత్రూం ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. శుభ్రం చేసే వారే లేక విద్యార్థులే స్వయంగా సాప్ సపాయి చేసుకోవాల్సిన పరిస్థితి.

మెనూ ప్రకారం భోజనం, పుస్తకాలు, బ్యాగులు, కాస్మోటిక్స్ పేరిట వచ్చే నిధులను సిబ్బంది కాజేస్తున్నారని విద్యార్థుల నుండి ఆవేదన వ్యక్తమవుతోంది. హాస్టల్ లో 60 మంది విద్యార్థులుండగా.. వార్డెన్ శ్రీహరి పట్టించుకోకపోవడంతో కొందరు‌ విద్యార్థులు చెడు వ్యసనాలకు‌ అలవాటు పడుతున్నారనే ఆరోపణలు‌ ఉన్నాయి. తినడానికి‌ తిండి ఉండేందుకు సరైన వసతి లేకపోతే మేమేలా చదువుకోగలుగుతాం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బైంసా సాంఘిక‌ సంక్షేమ గురుకుల హాస్టల్ విద్యార్థులు.

వార్డెన్ శ్రీవారి భైంసా సాంఘీక సంక్షేమ వసతి గృహం తో పాటు లొకేశ్వరం బాలుర వసతి గృహానికి సైతం ఇంచార్జ్ వార్డెన్ గా కొనసాగుతున్నారు. ఆ హాస్టల్ లోను‌ ఇదే పరిస్థితి ఉందని‌ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వసతులు కల్పించాలని కనీసం వసతి గదులైన శుభ్రంగా ఉండేలా చూడాలని వార్డెన్ ను పదే పదే వేడుకున్నా ఫలితం లేకుండా పోతుంది. ప్రభుత్వం స్పందించి మా కష్టాలు తీర్చాలని కోరుతున్నారు విద్యార్థులు. వార్డెన్ నిర్లక్ష్యం తో కొందరు సీనియర్లు వేధింపులకు పాల్పడుతున్నారని, సీనియర్ల అరాచకాలు తట్టుకోలేక పోతున్నామనే ఆరోపణలు సైతం చేస్తున్నారు జూనియర్ విద్యార్థులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..