పాఠశాల తరగతి గదిలో నుంచి అదే పనిగా శబ్ధాలు.. తొంగి చూసేసరికి కెవ్వు కేక..!

పరిసరాల పరిశుభ్రత లేకపోవడం.. ప్రభుత్వ పాఠశాలు, ఆశ్రమ పాఠశాలల పక్కనే పిచ్చి మొక్కలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. వాటిని తొలగించకపోవడంతో స్కూళ్లలో పాములు, తేళ్లు స్వైర విహారం చేస్తున్నాయి. ఏకంగా తరగతి గదుల్లోకి ప్రవేశించి బుసలు కొడుతున్నాయి. హనుమకొండ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పాము హల్చల్ చేసింది. పంతుళ్ళను పరుగులు పెట్టించింది.

పాఠశాల తరగతి గదిలో నుంచి అదే పనిగా శబ్ధాలు.. తొంగి చూసేసరికి కెవ్వు కేక..!
Government School In Hanumakonda District

Edited By:

Updated on: Jun 18, 2025 | 4:39 PM

పరిసరాల పరిశుభ్రత లేకపోవడం.. ప్రభుత్వ పాఠశాలు, ఆశ్రమ పాఠశాలల పక్కనే పిచ్చి మొక్కలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. వాటిని తొలగించకపోవడంతో స్కూళ్లలో పాములు, తేళ్లు స్వైర విహారం చేస్తున్నాయి. ఏకంగా తరగతి గదుల్లోకి ప్రవేశించి బుసలు కొడుతున్నాయి. హనుమకొండ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పాము హల్చల్ చేసింది. పంతుళ్ళను పరుగులు పెట్టించింది.

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్‌లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఈ ఘటన జరిగింది.. పాఠశాల ఆవరణలోని అంగన్‌వాడి కేంద్రం వద్ద పాము హల్చల్ చేసింది. పక్కనే ఉన్న నర్సరీ నుంచి పాఠశాలలోకి ప్రవేశించిన పాము అక్కడున్న వారిని పరుగులు పెట్టించింది. పామును ముందే గమనించిన అంగన్‌వాడి కేంద్రం నిర్వాహకులు, ముందే గది తలుపులు వేశారు. కానీ చిన్న గ్యాప్ లో నుండి గదిలోకి వెళ్లిన పాము అక్కడే తిష్ట వేసింది. దాదాపు రెండు గంటల తర్వాత స్నేక్ క్యాచర్ వచ్చి ఆ పామును పట్టారు.

వీడియో చూడండి..

స్కూల్ ఆవరణలో నిత్యం సంచరిస్తున్న పాములను చూసి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల పక్కనే హరితహారం కోసం నర్సరీ నిర్వహిస్తున్నారు. అందులో శుభ్రత లేకపోవడం, చెత్త పేరుకుపోవడంతో పాములు, తేళ్లు స్వైర విహారం చేస్తున్నాయని అంటున్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాములు, తేళ్లను చూసి ఆందోళన ఆందోళన చెందుతున్నారు. స్కూల్ పక్కన ఏర్పాటు చేసిన నర్సరీని తొలగించి పాముల నుండి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..