AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ డ్రీమ్స్‌.. రెండంకెల స్కోర్ కోసం పార్టీల వ్యూహం..

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ త్వరలోనే వచ్చేస్తోంది. ఏపీలో ఎంపీతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణలో మాత్రం 17 పార్లమెంటు స్థానాలకు ఎలక్షన్‌ జరగనుంది. ఈ 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో త్రికోణ పోటీ గట్టిగానే ఉంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మూడు పార్టీలు డబుల్‌ డిజిట్‌ తప్పనిసరిగా గెలుస్తామంటున్నాయి.

Telangana: తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ డ్రీమ్స్‌.. రెండంకెల స్కోర్ కోసం పార్టీల వ్యూహం..
Brs Bjp Congress
Shaik Madar Saheb
|

Updated on: Mar 13, 2024 | 10:17 AM

Share

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ త్వరలోనే వచ్చేస్తోంది. ఏపీలో ఎంపీతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణలో మాత్రం 17 పార్లమెంటు స్థానాలకు ఎలక్షన్‌ జరగనుంది. ఈ 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో త్రికోణ పోటీ గట్టిగానే ఉంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మూడు పార్టీలు డబుల్‌ డిజిట్‌ తప్పనిసరిగా గెలుస్తామంటున్నాయి. ఇప్పటికే ఈ మూడు పార్టీల మధ్య డైలాగ్‌ వార్‌ దుమ్ము రేపుతోంది. సత్తా పే సవాళ్లు పేలుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలు టార్గెట్‌గా తెలంగాణ గట్టుపైన డబుల్‌ డిజిట్‌పై దృష్టి సారించాయి బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్ఎస్..

2019లో పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్‌ 3, బీజేపీ 4, MIM 1 స్థానాలను చేజిక్కించుకున్నాయి. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మూడు డబుల్‌ డిజిట్‌పై గురి పెట్టాయి. ఇస్‌ బార్‌.. చార్‌ సౌ పార్‌.. మిషన్‌ 400 ప్లస్‌ లక్ష్యంగా కమలదళం వ్యూహాలకు పదను పెడుతోంది .దక్షిణాదిపై ముఖ్యంగా తెలంగాణ మీద బీజేపీ హైకమాండ్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. గత లోకస్‌భ ఎన్నికల్లో బీజేపీ 4 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈసారి తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో 12 సీట్లు బీజేపీ గెలుచుకోవడం ఖాయమన్నారు అమిత్‌ షా.

2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ మూడు ఎంపీ స్థానాలు చేజిక్కించుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 14 ఎంపీ స్థానాలు గెలవాలనేది కాంగ్రెస్‌ టార్గెట్‌. అంటే అదనంగా 11 స్థానాలపై గురి పెట్టింది. అధికారంలో ఉన్న పార్టీ.. అందులోనూ రేవంత్‌ లాంటి నాయకుడు సీఎం సీట్లో ఉన్నసమయంలో అధిష్టానానికి ఆశలు గట్టిగానే ఉంటాయి.

ఇక లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్దమైంది BRS. గత ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న BRS..ఇప్పుడు డబుల్‌ డిజిట్‌ పక్కా అంటోంది.

అయితే 2024 ఎన్నికలు టార్గెట్‌గా కాంగ్రెస్‌- బీఆర్‌ఎస్‌ మధ్య ఇప్పటికే సవాళ్లు ఓ రేంజ్‌లో రీసౌండ్‌ ఇచ్చాయి. రా చూస్కుందాం అంటూ సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు ఘాటుగానే రియాక్ట్‌ అయ్యారు కేటీఆర్‌.

డబుల్‌ గేమ్స్‌ అంటే ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క. తెలంగాణలో రెండంకెల స్కోరు కొడితే ఆ పార్టీ ఆధిపత్యం వచ్చే ఐదేళ్లు కొనసాగుతుందనేది పక్కా..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..