Raithu Maha Dharna: కార్పొరేట్ల లబ్ధికి మోడీ సర్కార్ తాపత్రయం.. రైతు డిమాండ్లను కేంద్రం అంగీకరిస్తేనే ఇళ్లకుః టికాయత్

|

Nov 25, 2021 | 7:30 PM

తమ డిమాండ్లను కేంద్రం అంగీకరించేంత వరకు ఇళ్లకు వెళ్లేదీలేదని సంయక్త కిసాన్​ మోర్చా నేత రాకేశ్​ టికాయత్ స్పష్టం చేశారు. రైతు సమస్యలపై కేంద్ర దిగి రాకుంటే.. ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు.

Raithu Maha Dharna: కార్పొరేట్ల లబ్ధికి మోడీ సర్కార్ తాపత్రయం..  రైతు డిమాండ్లను కేంద్రం అంగీకరిస్తేనే ఇళ్లకుః టికాయత్
Rakesh Tikait
Follow us on

Farmers Associations Maha Dharna at Indira park: తమ డిమాండ్లను కేంద్రం అంగీకరించేంత వరకు ఇళ్లకు వెళ్లేదీలేదని సంయక్త కిసాన్​ మోర్చా నేత రాకేశ్​ టికాయత్ స్పష్టం చేశారు. రైతు సమస్యలపై కేంద్ర దిగి రాకుంటే.. ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. దేశంలో వ్యవసాయ చట్టాల రద్దును పార్లమెంట్‌లో ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ.. హైదరాబాద్‌లో చేపట్టిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. సాగు చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధరల చట్టం తీసుకురావల్సిందేనని ఆయన డిమాండ్​ చేశారు.

సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించినా.. ఎన్నో సందేహాలు ఉన్నాయని రాకేశ్‌సింగ్ టికాయత్ అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో వ్యవసాయ చట్టాల రద్దు అంశంపై పార్లమెంట్‌లో ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ.. హైదరాబాద్‌లో మహాధర్నా చేపట్టారు. సాగు చట్టాలు రద్దు యాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన రైతు ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి(ఏఐకేఎంఎస్‌‌), సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) పిలుపు మేరకు ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎస్‌కేఎం నేత రాకేశ్ టికాయత్‌, ఏఐకేఎస్ నేతలు హన్నన్ మొల్ల, అతుల్ కుమార్ అంజన్, జాగ్తర్ బజ్వా, ఆశిష్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్ష రైతు సంఘాల నేతలు పశ్య పద్మ, తీగల సాగర్, విస్సా కిరణ్ కుమార్, వేములపల్లి వెంకటరామయ్య, విమలక్క తదితరులు పాల్గొన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఏడాది పాటు ఉద్యమం చేయటం ఇదే తొలిసారి అని టికాయత్​ తెలిపారు. మోడీ సర్కారు ప్రజల ప్రభుత్వం కాదన్న టికాయత్​.. అదానీ, అంబానీ ఆదేశాలతోనే కేంద్రం నడుస్తోందన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలన్నారు. కనీస మద్దతు ధరల చట్టం తీసుకురావల్సిందేనని డిమాండ్​ చేశారు. తమ డిమాండ్లను కేంద్రం అంగీకరిస్తేనే ఇళ్లకు వెళతామన్న టికాయత్‌.. ఒప్పుకోకుంటే ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

“భాష వేరైనా మనందరి భావన ఒక్కటే. కేవలం సాగుచట్టాల రద్దు కోసమే మా పోరాటం కాదు. మోదీ సర్కారు ప్రజల ప్రభుత్వం కాదు. ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో మోదీ సర్కారు కొనసాగుతోంది. అదానీ, అంబానీ ఆదేశాలతోనే కేంద్రం నడుస్తోంది. ఢిల్లీలో ఏడాది పాటు ఉద్యమం ఇదే తొలిసారి. కార్పొరేట్ల లబ్ధికి మోడీ ప్రభుత్వం తాపత్రయపడుతోంది. సాగుచట్టాల రద్దుపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. రైతు ఉద్యమంలో మరణించిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కనీస మద్దతు ధరల చట్టం తీసుకురాల్సిందే. రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం కమిటీ వేయాలి. కమిటీలో ఎస్‌కేఎం నేతలు, శాస్త్రవేత్తలను భాగస్వాములు చేయాలి. విద్యుత్ సవరణ బిల్లు రద్దుపై ప్రధాని సమాధానమివ్వాలి. విత్తనబిల్లు తీసుకురాకుండా ప్రైవేటు కంపెనీలకు కొమ్ముకాస్తున్నారు. ఇప్పటికైనా మేం చర్చలకు సిద్ధం, విస్తృతంగా చర్చిద్దాం. మా డిమాండ్లు కేంద్రం అంగీకరిస్తేనే ఇళ్లకు వెళతాం. డిమాండ్లు ఒప్పుకోకుంటే ఉద్యమం కొనసాగుతుంది. ఉద్యమంలో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి. రైతు ఉద్యమంపై కేసీఆర్ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి. తెలంగాణలో ధాన్యం సేకరణలో టీఆర్ఎస్ వైఖరి సరిగా లేదు.” అని రాకేష్​సింగ్​ టికాయత్ స్పష్టం చేశారు.

Read Also…  Karrala Jathara: ఒకే గ్రామానికి చెందిన వాళ్లంతా కర్రలతో కొట్టుకుంటారు.. వారి మధ్య విద్వేషాలు, గొడవలు లేవు.. మరీ ఏంటీ?