Summer Holidays: ఈసారి స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్ని రోజులో తెల్సా..?.. ఈ నెల బాగా చదవండి..

|

Mar 26, 2023 | 7:13 PM

తెలంగాణలో వేసవి సెలవులు అనంతరం జూన్ 12న తిరిగి స్కూళ్లను తెరుస్టారు. విద్యార్థులకు 48 రోజుల పాటు వేసవి సెలవులు ఉండనున్నాయి.

Summer Holidays: ఈసారి స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్ని రోజులో తెల్సా..?.. ఈ నెల బాగా చదవండి..
Telangana School Holidays
Follow us on

తెలంగాణ విద్యార్థులారా వేసవి సెలవులకు ఇంకా కచ్చితంగా నెల రోజుల మాత్రమే గడువు ఉంది. ఈ మధ్యలోనే వార్షిక పరీక్షలు జరగనున్నాయి. అందుకే బాగా చదవి ఎగ్జామ్స్ రాయండి. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు స్కూళ్లకు ఈ ఏడాది సమ్మర్ హాలిడేస్ ఉంటాయని గతంలోనే విద్యాశాఖ తెలిపింది. ఈ లెక్కన చూసుకుంటే మధ్యలో ఉన్నది 30 రోజులే.  1 నుండి 9వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 ఎగ్జామ్స్ ఏప్రిల్ 12 నుంచి స్టార్టవ్వనున్నాయి. ఏప్రిల్ 20వ తేదీ వరకు జరుగుతాయి. అంటే పరీక్షలకు రెండు వారాలు మాత్రమే గడువుతుంది. అందుకే ఈ టూ వీక్స్ బాగా రివిజన్ చేసుకోండి. టెన్షన్ పడొద్దు. హైరానా పడిపోతే వచ్చిన ఆన్సర్స్ కూడా గుర్తుకుపోతాయి. ఫ్రెండ్స్‌తో కలిసి ఇంపార్టెంట్ టాపిక్స్ గ్రూప్ డిస్కషన్స్ చేయండి.

ఇక ఏప్రిల్ 3 నుంచి 13 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షా సమయం ఉంటుంది. కాంపోజిట్ కోర్సు, సైన్స్ పేపర్ల వ్యవధి మార్నింగ్ 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సంవత్సరం 11 పేపర్లకు బదులు 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. హాల్ టికెట్లను స్కూళ్లకు పంపారు.. మరోవైపు అధికారిక వెబ్ సైట్లో సైతం అందుబాటులో ఉన్నాయి.  ఎగ్జామ్ సెంటర్లలో విద్యార్థులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేయనున్నారు. అలానే ఎగ్జామ్ సెంటర్లలో ప్రథమ చికిత్స కిట్‌లతో పాటు పరీక్షలు జరిగే అన్ని రోజులలో ఒక ఏఎన్‌ఎం అందుబాటులో ఉండడనున్నారు. స్టూడెంట్స్ పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి అందుబాటులో ఆర్టీసీ బస్సులను ఉంచారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..