TSRTC: టీఎస్ ఆర్టీసీని రైట్ రూట్ లో పెట్టె పనిలో సజ్జనార్.. వారికి గట్టి వార్నింగ్

|

Oct 16, 2021 | 5:57 PM

MGBS Stall: తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఎండీగా సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన మార్కుని..

TSRTC: టీఎస్ ఆర్టీసీని రైట్ రూట్ లో పెట్టె పనిలో సజ్జనార్.. వారికి గట్టి వార్నింగ్
Mgbs Stall
Follow us on

TSRTC: తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఎండీగా సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన మార్కుని చూపిస్తున్నారు. ఆర్టీసీ సంస్థ ఉన్నతి కోసం వినూత్న నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో అంతే చురుగ్గా ఉంటూ..ఆర్టీసీ ఉన్నతికోసం ప్రజలు సహకరించాలని కోరారు.  అంతేకాదు సంబంధిత డిపో మేనేజర్లకు చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న స్టాల్‌ల గురించి తెలియజేయమని సజ్జనార్ సూచించారు.

ఈ నేపథ్యంలో ఒక ప్రయాణీకుడు ఎంజిబియస్ బస్టాండ్ లో స్టాల్ నిర్వాహకుడి నిర్వాహకాని తెలియజేస్తూ.. ఎమ్మార్ఫీ కంటే అధిక ధరకు వస్తువులు అమ్ముతున్నాడంటూ.. ట్విట్టర్ లో సజ్జనర్ కి ట్వీట్ చేశాడు. అందుకు సంబందించిన రశీదుని కూడా జతపరిచాడు. దీంతో వెంటనే స్పదించిన మహాత్మాగాంధీ బస్ స్టేషన్ సిబ్బంది స్టేషన్ లోని స్టాల్స్ ను తనిఖీ చేశారు. అధిక ధరకు వస్తువు అమ్ముతున్న శ్రీ వెంటకటేశ్వర షాప్ నిర్వాహకుడికి వెయ్యి రూపాయల ఫైన్ ను విధించారు. అంతేకాదు మిగిలిన దుకాణదారులను హెచ్చరించారు. సజ్జనార్ టీఆర్టీసీలో తీసుకొస్తున్న మార్పులను చేపట్టిన సంస్కరణలతో నెటిజన్లు ఠాగూర్ లో చిరంజీవి డైలాగ్ గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు సజ్జనార్  రియల్ ఠాగూర్ అంటూ నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read:  సన్నజాజి తీగలా మారిన కుష్బూ.. లాక్ డౌన్ కారణం అంటున్న నటి.. ఫోటోలు చూస్తే మీ కళ్లను మీరే నమ్మరు