Telangana: పుణ్యాత్ములు మాత్రమే ఈ మార్గం దాటి స్వామివారిని దర్శించుకోగలరు

| Edited By: Ram Naramaneni

Feb 19, 2024 | 4:15 PM

పరుశరాముడు ప్రతిష్టించిన చివరి లింగంగా చెప్పుకునే ఈ క్షేత్రంలో మూడు గుండ్లకు విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. నామాల ఆకారంలో ఉండే వీటిపైన వెలిసిన దైవాన్ని ప్రార్ధిస్తే సకల పాపాలు తొలగి పోతాయని భక్తుల విశ్వాసం. ఈ బండరాళ్ల మధ్య దూరం చాలా తక్కువగా ఉండడంతో దీనిలోంచి వెళ్లడానికి చాలా మంది భయపడుతుంటారు. కొందరు మాత్రం భారీ శరీరాలున్నా ఈజీగా బయటకు వెళ్తారు.

Telangana: పుణ్యాత్ములు మాత్రమే ఈ మార్గం దాటి స్వామివారిని దర్శించుకోగలరు
Chervugattu Temple
Follow us on

నల్గొండ జిల్లా, ఫిబ్రవరి 19: మనిషి పట్టలేనంత చిన్న సందు ఉన్న బండరాళ్లు అవి. కానీ వాటిల్లోంచి ఎంతటి లావు వ్యక్తులైన బయటకు వెళ్లగలుగుతారు. అణువణువునా భయాన్ని పుట్టించే ఆ మార్గం గుండా వెళ్ళి.. మూడు గుండ్లపై వెలిసిన దేవుణ్ని దర్శించుకుంటారు. కానీ పుణ్యాత్ములు మాత్రమే అక్కడ ప్రవేశం. పుణ్యాత్ములకు మాత్రమే ప్రవేశం అంటున్న ఆ దేవాలయం ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

నల్లగొండ జిల్లాలో చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం అతి పురాతనమైనది. త్రేతాయుగంలో పరశురాముడు పాప ప్రక్షాళన కోసం 108 శివలింగాలను ప్రతిష్టించాడు. వాటిలో చివరి శివలింగాన్ని చెరువుగట్టులో ప్రతిష్టించినట్లు స్థల పురాణం చెబుతోంది. చెర్వుగట్టు గుట్టపై మూడు గుండ్లగా చెప్పుకునే రాతి గుట్టలపై కొలువైన ఈ దేవుడి పార్వతీ జడల రామలింగేశ్వరుడు. ఈ చెర్వుగట్టు దేవాలయం శివ భక్తులకు చిరపరిచితమైన పుణ్యక్షేత్రం. నిత్యం వేలాది మంది ఇక్కడి దైవాన్ని దర్శించుకుంటారు.అమావాస్య రోజున స్వామి వారి సన్నిధిలో నిద్రిస్తే అన్ని రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం. అయితే అన్ని ఆలయాల్లో మాదిరిగా ఇక్కడి దేవుణ్ని సునాయసంగా చూడలేం. కొండపైన భాగాన ఉన్న దైవాన్ని దర్శించుకోవాలంటే రాతి బండల సందుల్లోంచి దూసుకెళ్తేనే దైవదర్శనం కల్గుతుంది. దారి మొత్తం ఇరుకైన రాళ్ల సందులోంచే సాగుతుంది. ఒక దగ్గర మాత్రం మరీ ఇబ్బందికరంగా …రెండు బండల మధ్య అతి తక్కువ ఖాళీ ప్రదేశం ఉంటుంది. దానిలోంచి అడ్డంగా ప్రయాణిస్తేనే అవతలి వైపుకు చేరుకోగలుగుతారు.

మూడు గుండ్ల విశిష్టత..

పరుశరాముడు ప్రతిష్టించిన చివరి లింగంగా చెప్పుకునే ఈ క్షేత్రంలో మూడు గుండ్లకు విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. నామాల ఆకారంలో ఉండే వీటిపైన వెలిసిన దైవాన్ని ప్రార్ధిస్తే సకల పాపాలు తొలగి పోతాయని భక్తుల విశ్వాసం. ఈ బండరాళ్ల మధ్య దూరం చాలా తక్కువగా ఉండడంతో దీనిలోంచి వెళ్లడానికి చాలా మంది భయపడుతుంటారు. కొందరు మాత్రం భారీ శరీరాలున్నా ఈజీగా బయటకు వెళ్తారు. వెళ్లలేని వాళ్లు దైవం కరుణించలేదని వెనక్కి తిరిగి వెళ్తారు. ఇక్కడి దైవ దర్శనం కేవలం పుణ్యాత్ములకు మాత్రమే దక్కుతుందని భక్తులు నమ్ముతారు. పాపాలు చేసిన వారికి ఇక్కడ స్వామి వారు దర్శన భాగ్యం ఇవ్వకుండా మూడు గుండ్ల నుంచే వెనక్కి పంపుతారని భక్తులు విశ్వసిస్తున్నారు.

బండరాళ్ల మధ్య నుండి అతికష్టం మీద పైకి చేరిన వాళ్లంతా దేవుణ్ని మనసారా ప్రార్ధించి కిందికి వెళ్తారు. ఇక్కడి గుట్టపైకి మెట్ల మార్గం ద్వారా వెళ్లడం పుణ్యమేనని మరికొందరి నమ్మకం.

Jadala Ramalingeswara Swamy

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..