Telangana: తెలంగాణలో వేసవి సెలవులు మరో వారం పెంచనున్నారా..? ఇదిగో క్లారిటీ

|

Jun 10, 2023 | 6:11 PM

TS Schools: తెలుగు రాష్ట్రాల్లో వానలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎండ మాత్రం దంచేస్తుంది. పలు ప్రాంతాల్లో అయితే వడగాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో స్కూళ్లకు వేసవి సెలవులు పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై క్లారిటీ మీ కోసం...

Telangana: తెలంగాణలో వేసవి సెలవులు మరో వారం పెంచనున్నారా..? ఇదిగో క్లారిటీ
Telangana Schools
Follow us on

రుతుపవనాలు కేరళను తాకాయి కానీ.. మన దగ్గరకు వచ్చేసరికి సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో అయితే వడగాలలు వీస్తున్నాయి. దీంతో వాతావరణ పరిస్థితులను బట్టి పాఠశాలలకు వేసవి సెలవులను మరో మూడు రోజులు లేదా వారం రోజులు పొడిగించాలని పలువురి నుంచి విద్యాశాఖ వినతులు వస్తున్నాయి. సెలవులు పొడిగించారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. ఈ క్రమంలో తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం..  జూన్‌ 12 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ అవుతాయని వెల్లడించింది. సెలవుల పొడిగింపు ఎట్టి పరిస్థితిల్లోనూ ఉండదని అధికారులు ప్రకటించారు.  అయితే  తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు మాత్రం వడగాలుల నేపథ్యంలో వేసవి సెలవులను వారం నుంచి 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి.

తెలంగాణలోని స్కూల్స్ 2023-24 అకడమిక్‌ క్యాలెండర్‌ను ఇటీవల విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం మొత్తం 229 పనిదినాలు ఉండనున్నాయి. దసరా సెలవులు పోయిన సంవత్సరం 14 రోజులు ఉండగా ఈసారి 13 రోజులే (అక్టోబరు 13 నుంచి 25 వరకు) ఉండనున్నాయి. క్రిస్మస్‌ సెలవులు కూడా ఏడు నుంచి అయిదుకు కుదించారు.  డిసెంబరు 22 నుంచి 26 వరకు క్రిస్మస్ హాలిడేస్ ప్రకటించారు.  ప్రతి నెలా 4వ శనివారంను నో బ్యాగ్ డే కింద  ప్రకటించారు. ఆ రోజున పుస్తకాల బ్యాగుతో పాఠశాలకు వెళ్లాల్సిన పనిలేదు.

ఆంధ్రాలోనూ జూన్ 12 నుంచే…

ఆంధ్రాలో సైతం జూన్‌ 12 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ అవ్వనున్నాయి. అదే రోజున పల్నాడు జిల్లా క్రోసూరులో ముఖ్యమంత్రి జగన్‌.. స్టూడెంట్స్‌కు జగనన్న విద్యా కానుక కిట్‌లను అందజేస్తారు. పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..