Telangana: దేశవ్యాప్త సుడిగాలి పర్యటనకు గులాబీ బాస్ రెడీ.. 80 కోట్లతో స్పెషల్ చార్టర్డ్‌ ఫ్లైట్‌ !

|

Sep 29, 2022 | 9:58 PM

ఆల్ సెట్. జాతీయ రాజకీయాల్లో తన మార్క్ చూపేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక రెడీ చేశారు. ఇందుకు ముహూర్తం కూడా పిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Telangana: దేశవ్యాప్త సుడిగాలి పర్యటనకు గులాబీ బాస్ రెడీ.. 80 కోట్లతో స్పెషల్ చార్టర్డ్‌ ఫ్లైట్‌ !
Telangana CM KCR
Follow us on

తెలంగాణలో జోరు మీదున్న కారు పార్టీ త్వరలోనే రాష్ట్ర సరిహద్దులను దాటి దేశం మొత్తం దూసుకుపోనుంది. రెక్కలు కట్టుకుని గాల్లోకి రివ్వుమంటూ ఎగిరిపోనుంది. దసరా రోజు దీనికి ముహూర్తం పెట్టారు. జాతీయ రాజకీయాల్లో జెండా ఎగరెయ్యడానికి ఏకంగా ప్రత్యేక విమానంలోనే దేశవ్యాప్త సుడిగాలి పర్యటనకు గులాబీ బాస్ రెడీ అవుతున్నారు. దీనికోసం త్వరలో ప్రత్యేక విమానాన్ని టీఆర్‌ఎస్‌ కొనుగోలు చేయనుందని సమాచారం. విజయదశమి రోజున జాతీయ పార్టీ ప్రకటన తర్వాత విమానం కొనుగోలు చేసేందుకు టీఆర్‌ఎస్‌ ఆర్డర్‌ ఇవ్వనుంది. దేశమంతా సుడిగాలి పర్యటన కోసం కేసీఆర్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 12 సీట్ల సామర్థ్యమున్న చార్టర్డ్‌ ఫ్లైట్‌ కోసం 80 కోట్లు ఖర్చు కానుంది. ఈ మొత్తాన్ని విరాళాల రూపంలో గులాబీ పార్టీ సేకరించనుంది. ఇప్పటికే పార్టీ ఖజానాలో 865 కోట్ల రూపాయల ఫండ్స్‌ ఉన్నా, విమానం కొనుగోలుకు విరాళాలు ఇచ్చేందుకు నేతలు పోటీ పడుతున్నారు. విమానం కొనుగోలు తర్వాత సొంత విమానం కలిగిన రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్‌కి గుర్తింపు లభించనుంది.

దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన, ఆ తర్వాత స్పెషల్ అజెండా సెట్‌ చేసుకుని, ఆ అజెండాను దేశమంతా విస్తరించేందుకు సుడిగాలి పర్యటన చెయ్యడం కేసీఆర్ షెడ్యూల్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో హెలికాప్టర్‌లో రాష్ట్ర పర్యటన చేసిన కేసీఆర్‌ విజయం సాధించారు. ఇప్పుడు విమాన పర్యటనలతో జాతీయ స్థాయిలో కూడా సత్తాను చాటేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

అయితే టీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీ ప్రకటనపై విపక్షాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సీపీఐ దీన్ని స్వాగతిస్తుండగా బీజేపీ, కాంగ్రెస్‌లు వ్యతిరేకిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌ ఎంటర్‌ అయితే ఎలా ఉంటుందో అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం