SLBC Tunnel Recue operation: కీలక దశకు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్

SLBC టన్నెల్‌ ప్రమాద ఘటనను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్‌పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే ప్రధాని మోదీ స్పందించారని.. సీఎం రేవంత్‌తో మాట్లాడి రెస్క్యూ బృందాలను పంపించారని తెలిపారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. ప్రభుత్వ వైఫల్యంతోనే

SLBC Tunnel Recue operation: కీలక దశకు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్
Slbc Tunnel Rescue

Updated on: Mar 01, 2025 | 8:04 PM

SLBC టన్నెల్‌ దగ్గర రెస్క్యూ ఆపరేషన్‌ కీలక దశకు చేరుకుంది. 8 మంది కార్మికుల జాడ కనుగొనేందుకు అత్యాధునిక పరికరాలతో రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. దానిలో భాగంగా.. అనుమానిత లొకేషన్లలో డ్రిల్లింగ్ నిర్వహిస్తున్నాయి. టన్నెల్ దగ్గర ఆక్సిజన్‌, ఎమర్జెన్సీ అంబులెన్స్‌లను రెడీగా ఉంచారు. అటు.. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో ఫోరెన్సిక్‌ నిపుణులు సైతం ఘటనాస్థలానికి వెళ్లారు.

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ దగ్గర కొనసాగుతున్న పనులను మంత్రులు ఉత్తమ్‌, జూపల్లి కృష్ణారావు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ పురోగతిపై మంత్రులు ఉత్తమ్‌, జూపల్లి.. అధికారులతో చర్చించారు.

ఇక…SLBC టన్నెల్‌ ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక విషయాలు వెల్లడించారు. రేపు రాత్రి వరకు నలుగురు కార్మికుల ఆచూకీ తెలిసే అవకాశం ఉందని చెప్పారు. మరో నలుగురు కార్మికులు టీబీఎం మిషన్‌ కింద ఉండొచ్చని రెస్క్యూ టీమ్‌లు అనుమానిస్తున్నాయని తెలిపారు. టన్నెల్‌లోని టీబీఎం మిషన్‌ను కట్‌ చేయాల్సి వచ్చిందన్నారు. రాడార్‌ ద్వారా గుర్తించిన కొన్ని ప్రాంతాల్లో మనుషులతో తవ్వకాలు కొనసాగుతున్నాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు.

ఇవి కూడా చదవండి

SLBC టన్నెల్‌ ప్రమాద ఘటనను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్‌పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే ప్రధాని మోదీ స్పందించారని.. సీఎం రేవంత్‌తో మాట్లాడి రెస్క్యూ బృందాలను పంపించారని తెలిపారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. ప్రభుత్వ వైఫల్యంతోనే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం జరిగిందని.. ముందస్తు జాగ్రత్తలు లేకుండా పనులు చేపట్టారని ఆరోపించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి