SLBC Tunnel Rescue: క్షణం.. క్షణం ఉత్కంఠ.. కీలక దశకు SLBC టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌..

|

Mar 01, 2025 | 10:30 AM

వారం దాటింది.. SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ 8వ రోజుకు చేరింది. సొరంగంలో చిక్కుకున్న 8మంది ఆచూకీపై ఇంకా క్లారిటీ లేదు. ప్రతిబంధాకాలను తొలగించుకుంటూ రెస్యూ సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకున్నాయి. జీరో పాయింట్‌ దగ్గర సెర్చింగ్‌ కొనసాగుతోంది. GPR రికార్డ్‌ చేసిన మెత్తని భాగాలేంటి? జీపీఆర్‌ ద్వారా గుర్తించిన ఐదు కీలక స్పాట్‌లో ఇవాళ సెర్చింగ్‌ ముమ్మరం చేస్తున్నారు. కాసేపట్లో కీలక అప్‌డేట్‌ వచ్చే అవకాశం వుంది..

SLBC Tunnel Rescue: క్షణం.. క్షణం ఉత్కంఠ.. కీలక దశకు SLBC టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌..
Telangana SLBC Tunnel Rescue Operation
Follow us on

నాగర్‌ కర్నూల్‌ జిల్లా దోమలపెంట SLBC టన్నెల్‌లో రెస్యూ ఆపరేషన్‌ కీలక దశకు చేరుకుంది. గతం వారం రోజులుగా NDRF, SDRF, ఆర్మీ, నేవీ, రైల్వే, సింగరేణి టీమ్స్‌ సహా ర్యాట్ మైనింగ్ బృందాలు శక్తివంచన లేకుండా శ్రమిస్తునే ఉన్నాయి. సొరంగంలో ధ్వంసమైన బోరింగ్‌ మిషన్ శిథిలాలను తొలగించేందుకు రైల్వేశాఖ రంగంలోకి దిగింది. మెషిన్ భాగాలను ప్లాస్మా కట్టర్‌తో వేరు చేస్తూ.. ఇంకోవైపు పేరుకుపోయిన బురదను లోకో డబ్బాల్లో బయటికి తరలిస్తున్నారు. కార్మికుల జాడ కనిపెట్టేందుకు అత్యాధునిక స్కానర్‌ను వినియోగిస్తున్నారు. అత్యాధునిక GPR ..గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌తో సొరంగంలో గాలిస్తున్నారు. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి, శిథిలాల కింద ఏమున్నదనేది పరిశీలిస్తున్నారు. ఐదు కీలక స్పాట్‌లు సహా మెత్తని భాగాలను జీపీఆర్‌ గుర్తించింది.

NGRI ఇచ్చిన 5 చోట్ల GPR ఫైండింగ్స్ లో సహాయక బృందాలు డ్రిల్లింగ్ చేపట్టాయి.. దీంతో నేటి రెస్క్యూ ఆపరేషన్ పై సర్వత్ర ఉత్కంఠ.. GPR ఫైండింగ్స్ లోకేషన్ లో ఏం తేలబోతోందని చర్చనీయాంశంగా మారింది.. ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధమైన అధికార యంత్రాంగం.. టన్నెల్ వద్ద ఆక్సిజన్ తో పాటు ఎమర్జెన్సీ ఎక్విప్ మెంట్ కలిగిన అంబులెన్సులను ఏర్పాటు చేసింది. మరోవైపు టన్నెల్లో కొనసాగుతున్న బురద, సీపేజ్, TBM మిషన్ శిథిలాల తొలగింపు కొనసాగుతుంది.. టన్నెల్ లో సీపేజ్ పెరగడంతో రెస్క్యూ ఆపరేషన్ కు కాస్త అడ్డంకులు ఏర్పడుతున్నట్లు అధికారులు తెలిపారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు చివరిదశకు చేరుకున్నాయి.. నేడు కన్వేయర్ బెల్ట్ సిద్ధమయ్యే అవకాశం ఉందని.. ఇది సిద్ధమైతే మరింత వేగంగా సహాయక చర్యలు కొనసాగనున్నాయి.

ఆ ప్రచారాన్ని నమ్మోద్దు..

జీపీఆర్‌ పరికరంతో సేకరిస్తున్న చిత్రాలను విశ్లేషిస్తున్నారు నిపుణులు. మెత్తని భాగాలున్నట్టు జీపీఆర్‌ గుర్తించిన చోట సెర్చ్‌ ఆపరేషన్‌ను మరింత ముమ్మరం చేశారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీపై సోషల్‌ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మోద్దన్నారు నాగర్‌ కర్నూలు జిల్లా కలెక్టర్‌.. రెస్క్యూ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుందన్నారు.

కార్మికుల ఆచూకీపై ఆందోళన..

మరోవైపు టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీపై ఆందోళనతో వారి కుటుంబసభ్యులు జార్ఖండ్‌ నుంచి నాగర్‌ కర్నూల్‌కు వచ్చారు. వారం గడిచినా తమవాళ్ల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదని,తమను లోనికి వెళ్లనీయడంలేదని వాపోయారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మెత్తని భాగాలేంటనేది సహా టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు,ఇద్దరు ఇంజీనీర్ల ఆచూకీపై ఇవాళ కీలక అప్‌డేట్‌ వచ్చే అవకాశం వుందంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..