Telangana: ఆ ఊర్లో 7 ఇళ్ల ముందు 7 క్షుద్ర ముగ్గులు.. ఉలిక్కిపడిన జనం.. పల్లెబాటలో మిడ్‌నైట్‌ ముగ్గుల లకలక

|

Oct 17, 2022 | 9:16 PM

మంత్రాలకు చింతకాయలు రాలవు. అందరికీ తెలుసు. కానీ లోలోన ఏదో భయం. రోడ్డుపై నిమ్మకాయ, మిరపకాయ, పసుపు, కుంకుమ కన్పిస్తే..కొందరికి దడ. ఇక పొద్దు పొద్దునే ఇంటి ముందే క్షుద్ర ముగ్గు కన్పిస్తే...రియాక్షన్‌ ఎలా వుంటుంది?

Telangana: ఆ ఊర్లో 7 ఇళ్ల ముందు 7 క్షుద్ర ముగ్గులు.. ఉలిక్కిపడిన జనం..  పల్లెబాటలో మిడ్‌నైట్‌ ముగ్గుల లకలక
Black Magic
Follow us on

వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో అర్ధరాత్రి ఇళ్ల ముందు పసుపు ముగ్గు వేసి..కుంకుమ..నిమ్మకాయలు పెట్టి వెళ్లారు. ఏడు చేపల కథ తెలిసే వుంటది. కానీ వూళ్లో ఆ ఏడు ఇళ్లు..ఏడు ముగ్గుల యవ్వారం కంటి మీద కనుకు లేకుండా చేసింది… కోరి కోరి కొత్త ఇల్లు కట్టుకుంటే …ఇంటి ముందు క్షుద్రముగ్గు… సీన్‌ చూశాక ఇంటి ఆసామి హార్ట్‌ బీట్‌ ఇక ఎట్లుంటదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.   పౌర్ణమి-అమావాస్య.. పొద్దు వచ్చిందంటే గుండెల్లో దడ.. రాత్రి వరకు అంతా కామూష్‌. తెల్లారి కల్లాపి చల్లబోతే ఇళ్ల ముందు మంత్రాల ముగ్గులు… ఇది ఎవరి పని? ఎందుకని?.. తాడోపేడో తేల్చాడనికి ఊరంతా ఏకతాటిపైకి వచ్చారు. మంత్రాల ముగ్గులేస్తున్న బ్యాచ్‌ను పసిగట్టారు. పట్టుకున్నారు. అంతే మంత్రాల చెమ్మాచెక్క  కొందరి మహిళల పనేనని తేలింది. పట్టుకొని గదిలో బంధించారు. రాపోలు గ్రామంలో ఆరుగురు మహిళల బ్యాచ్‌ను స్థానికులు అర్ధరాత్రి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ ఆరుగుర్ని నిర్బంధించిన గ్రామస్థులు .. పొద్దున్నే పోలీసులక సమాచారం ఇచ్చారు. సీన్‌లోకి వచ్చిన పోలీసులు సిక్స్‌మెంబర్‌ గ్యాంగ్‌ను ఠాణాకు తరలించారు. వీళ్లెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఆరుగురేనా.. వీళ్ల వెనుక వుందెవరు? ఎందుకని మంత్రాల ముగ్గులేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మంత్రాలు.. తంత్రాలు.. అంతా ట్రాష్‌. భయాన్ని అలుసుగా చేసుకొని భయపట్టే కుతంత్రాలే ఇవి. ఇంటి ముందు పసుపు నిమ్మ కాయ వేసినంత మాత్రాన వచ్చే నష్టమేమి లేదు.

ఏదో అనర్ధం జరిగిపోతుందనే భయంతో ..అనుమానంతో దాడులకు పాల్పడ్డం సరికాదు. నిజానిజాలు తేలుసుకోకుండా నిందలేస్తూ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే మరో నేరం అవుద్ది. సంయమనంతో వ్యవహరించిన రాపోలు గ్రామస్తులన్ని పోలీసులు అభినందించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నిజానిజాలు తేల్చి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రాలు-తంత్రాల వంటి మూఢనమ్మకాలను నమ్మోద్దని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..