Private Hospitals: నిబంధనలు బేఖాతరు.. కరీంనగర్ జిల్లాలో 6 ప్రైవేటు ఆసుపత్రుల లైసెన్స్‌లు రద్దు..

|

Jun 03, 2021 | 10:12 PM

Hospitals Licenses Cancelled: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ తరుణలో ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య పెరుగుతోంది. అలా చేరిన కరోనా

Private Hospitals: నిబంధనలు బేఖాతరు.. కరీంనగర్ జిల్లాలో 6 ప్రైవేటు ఆసుపత్రుల లైసెన్స్‌లు రద్దు..
Private Hospitals
Follow us on

Hospitals Licenses Cancelled: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ తరుణలో ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య పెరుగుతోంది. అలా చేరిన కరోనా బాధితుల నుంచి ప్రైవేటు ఆసుపత్రులు దోచుకుంటున్నాయి. అయితే.. నిబంధనలు పాటించాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నప్పటికీ ఆసుపత్రుల యజమాన్యాలు ధిక్కరిస్తున్నాయి. అలాంటి ప్రైవేట్‌ ఆసుపత్రులపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. ఇటీవల చాలా ఆసుపత్రుల లైసెన్స్‌లను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు నిబంధనలు బేఖాతరు చేస్తున్న ఆసుపత్రులకు షోకాజ్‌ నోటీసులు సైతం జారీ చేస్తోంది. స్పందించకుంటే చర్యలు తీసుకుంటూ కొరడా ఝుళిపిస్తోంది.

తాజాగా గురువారం కరీంనగర్‌ జిల్లాలో 6 ప్రైవేట్‌ ఆసుపత్రుల లైసెన్స్‌లను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. ఇటీవల షోకాజ్‌ నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో 15 రోజులపాటు లైసెన్స్‌లను రద్దు చేస్తూ కరీనగర్ డీఎంహెచ్ఓ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు కరీంనగర్‌లోని పుల్లెల ఆసుపత్రి, మురుగన్‌, కృష్ణ లేపాక్షి, జమ్మికుంటలోని మమత, శ్రీవిజయసాయి, సురక్ష ఆసుపత్రుల అనుమతులు తాత్కాలికంగా రద్దుచేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు ఆసుపత్రులన్నీ ప్రభుత్వ నిబంధనలను సక్రమంగా పాటించాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు డీఎంహెచ్ఓ.

Also Read:

Leopard: కోతి కాదు చిరుతే.. చెట్లపై యమ జంపింగ్‌లు చేస్తున్న చిరుత.. చూస్తే షాకే.. వీడియో

వేడుకగా పెళ్లి.. వేదికపై వధువు చేసిన పనితో బిత్తరపోయిన వరుడు.. షాకింగ్ వీడియో