TSPSC: టీఎస్‌పీఎస్సీలో తవ్వేకొద్ది బయటపడుతోన్న అక్రమాలు.. తెరపైకి హైటెక్‌ మాల్‌ ప్రాక్టీస్‌.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారంలో రోజుకో నిజం వెలుగులోకి వస్తుంది. మొన్నటి వరకు కేవలం పేపర్‌ లీకేజ్‌ వరకే పరిమితం అనుకుంటే తాజాగా హైటెక్‌ మాల్‌ ప్రాక్టీస్‌ వ్యవహారం ఒకటి బయటపడింది. విద్యుత్‌శాఖ డీఈ రమేశ్‌ కనుసన్నల్లో పెద్దఎత్తున ప్రశ్నపత్రాలు చేతులు మారినట్టు సిట్‌ నిర్దారించింది. పేపర్‌ లీకేజీకి ముందే...

TSPSC: టీఎస్‌పీఎస్సీలో తవ్వేకొద్ది బయటపడుతోన్న అక్రమాలు.. తెరపైకి హైటెక్‌ మాల్‌ ప్రాక్టీస్‌.
TSPSC Paper leak

Updated on: Jun 02, 2023 | 2:47 PM

Hyderabad News: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారంలో రోజుకో నిజం వెలుగులోకి వస్తుంది. మొన్నటి వరకు కేవలం పేపర్‌ లీకేజ్‌ వరకే పరిమితం అనుకుంటే తాజాగా హైటెక్‌ మాల్‌ ప్రాక్టీస్‌ వ్యవహారం ఒకటి బయటపడింది. విద్యుత్‌శాఖ డీఈ రమేశ్‌ కనుసన్నల్లో పెద్దఎత్తున ప్రశ్నపత్రాలు చేతులు మారినట్టు సిట్‌ నిర్దారించింది. పేపర్‌ లీకేజీకి ముందే 11 మంది అభ్యర్థులతో డీఈ రమేష్‌ డీల్‌ కుదుర్చుకున్నట్లు తేల్చింది. హైటెక్‌ మాల్‌ ప్రాక్టీస్‌కు హామీ ఇచ్చిన డీఈ రమేష్‌.. మాట ప్రకారమే డీఏవో, ఏఈఈ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన ప్రోత్సాహంతో ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ ద్వారా పరీక్ష రాశారు నలుగురు అభ్యర్థులు. ఆ ముఠా నుంచి మరో 20 మంది అభ్యర్థులు ప్రశ్నపత్రాలు కొనుగోలు చేయగా.. వారిని కూడా సిట్‌ బృందం గుర్తించినట్టు తెలుస్తోంది.

ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ల వినియోగం బట్టబయలు కావడం సంచలనంగా మారింది. ఈ హైటెక్‌ వ్యవహారమంతా.. మలక్‌పేట్‌ కేంద్రంగా కొనసాగినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. మలక్‌పేట్‌ నుంచి పరీక్ష హాల్లోని అభ్యర్థులకు మైక్రో వైర్‌లెస్‌ పరికరం ద్వారా సమాధానాలు చెప్పారు డీఈ రమేష్‌. ఈయన ద్వారా ఒకరినుంచి ఒకరికి మొత్తం 40 మందికి ఏఈ పేపర్‌ చేరింది. ఈ 40 మంది అభ్యర్థులను గుర్తించే పనిలో పడింది సిట్‌ బృందం. TSPSC ప్రశ్నపత్రాల లీకేజ్‌ కేసులో డీఈ రమేష్‌ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో సిట్‌ పిటిషన్‌ వేసింది.

డీఈ రమేష్‌ను 6 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. పరీక్ష పేపర్ల లీకేజ్‌తో 10 కోట్లు సంపాదించాలని డీఈ రమేష్‌ స్కెచ్‌ వేసినట్లు సిట్‌ గుర్తించింది. అలాగే.. ఇన్విజిలేటర్లకు డీఈ రమేష్‌ 20 లక్షలు ఇచ్చినట్లు తేల్చిన సిట్‌ అధికారులు.. ప్రస్తుతం వారిని విచారించే పనిలో నిమగ్నమైంది. ఇక.. కొన్ని నెలలుగా విధులకు దూరంగా ఉంటున్న డీఈ రమేష్‌పై గతంలోనూ పలు రకాల కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పశ్నపత్రాల లీకేజీ కేసులో ఇంకెన్ని సంచనాలు తెరపైకి వస్తాయో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..