TSPSC Paper Leak Case: దర్యాప్తులో రాజకీయ నాయకుల ఫోటోలు.. కీలక విషయాలను వెల్లడించిన సిట్ దర్యాప్తు అధికారి..

దర్యాప్తులో కొందరు రాజకీయ నాయకుల ఫోటోలు లభ్యమయ్యాయని అన్నారు సిట్ దర్యాప్తు అధికారి వెంకటేశ్వర్లు.. రాజకీయ నేతల పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

TSPSC Paper Leak Case: దర్యాప్తులో రాజకీయ నాయకుల ఫోటోలు.. కీలక విషయాలను వెల్లడించిన సిట్ దర్యాప్తు అధికారి..
Tspsc

Updated on: Mar 17, 2023 | 12:53 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇవాళ పలు కీలక విషయాలను వెల్లడించారు సిట్ దర్యాప్తు అధికారి వెంకటేశ్వర్లు. దర్యాప్తులో కొందరు రాజకీయ నాయకుల ఫోటోలు లభ్యమయ్యాయని అన్నారు సిట్ దర్యాప్తు అధికారి వెంకటేశ్వర్లు.. రాజకీయ నేతల పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో రాజకీయ నాయకుడైన రాజశేఖర్ రెడ్డి పాత్ర కీలకంగా మారిందన్నారు. రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ కలిసి లక్ష్మీని ట్రాప్ చేశారని సిట్ అధికారి చెప్పడం విశేషం.

లక్ష్మీ దగ్గర పాస్‌వర్డ్, ఐడీలను దొంగలించారని.. మొత్తం ఐదు పేపర్లను కాపీ చేసుకున్నట్లు సమాచారం. ఏయే పేపర్లు లీక్‌ అయ్యాయి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఏఈ పరీక్ష పేపర్‌ను రేణుకకు అమ్మింది ప్రవీణ్‌ అని తెలిపారు. గ్రూప్‌ 1 పరీక్ష పేపర్‌పై దర్యాప్తు చేస్తున్నామని.. ప్రవీణ్‌ రాసిన పరీక్షలో అధిక మార్కులు రావడంపై దర్యాపు సాగుతుందన్నారు.

ప్రవీణ్‌ ఎవరెవరికి పేపర్‌ ఇచ్చారన్నదానిపై విచారణ చేస్తున్నామన్నారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌, మరికొందరి ఫోన్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించామన్నారు. ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సిట్ అధికారి వెంకటేశ్వర్లు.

ఇదిలావుంటే, మంత్రి కేటీఆర్ నిన్న కొన్ని ఆరోపణలు చేశారు.  టీఎస్‌పీఎస్‌లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజశేఖర్‌ రెడ్డి… బీజేపీ సపోర్టర్‌గా బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. వోట్‌ ఫర్ బీజేపీ అంటూ అతను గతంలో చేసిన సోషల్‌ మీడియా పోస్టులను బయటకు తీసుకొస్తున్నారు.

పలువురు బీజేపీ నేతలతో రాజశేఖర్‌ రెడ్డి దిగిన ఫొటోలను కూడా.. బయటపెడుతున్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కుట్రతోనే బీజేపీ నేతలు ఇదంతా చేస్తున్నట్టు అనుమానం కలుగుతోందని ఆరోపిస్తున్నారు మంత్రి కేటీఆర్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం