Telangana: వర్షాల కోసం వినూత్న పూజలు.. గుట్టపై ‘వరద పాశం’

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గోవర్ధనగిరి గ్రామస్థులు సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని ఆకాంక్షిస్తూ సంజీవరాయని గుట్టపై వెలసిన ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థుల విశ్వాసం ప్రకారం ‘వరద పాశం’ వంటకాన్ని పాలతో తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. మహిళలు గుట్టపై బతుకమ్మ ఆడి వర్షాలు కురవాలని ప్రార్థించారు.

Telangana:  వర్షాల కోసం వినూత్న పూజలు.. గుట్టపై ‘వరద పాశం’
Sanjeeva Rayuni Gutta

Edited By:

Updated on: Sep 08, 2026 | 6:42 PM

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గోవర్ధనగిరి గ్రామస్థులు సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని ఆకాంక్షిస్తూ వినూత్నంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని సంజీవరాయని గుట్టపై వెలసిన ఆంజనేయస్వామికి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.

పాలతో ‘వరద పాశం’ వంటకం

గ్రామస్థుల విశ్వాసం ప్రకారం.. సంజీవరాయని గుట్టపై ‘వరద పాశం’ పోస్తే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని నమ్మకం. ఇందులో భాగంగా ఆవు, గేదె, గొర్రె, మేక పాలతో పాటు బెల్లం, బియ్యం కలిపి సంప్రదాయబద్ధంగా ‘వరద పాశం’ వంటకాన్ని తయారు చేశారు. అనంతరం దాన్ని ఆంజనేయస్వామికి నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరువులు, కుంటలు నిండిపోయి గ్రామంలో జలకళ సంతరించుకోవాలని ప్రార్థించారు.

కోనేరులో సామూహిక స్నానాలు

పూజా కార్యక్రమాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని కోనేరులో గ్రామస్థులు సామూహికంగా స్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు సంజీవరాయని గుట్టపై బతుకమ్మ ఆడి.. సమృద్ధిగా వర్షాలు కురవాలని వాన దేవుడిని వేడుకున్నారు.

గుట్టపైనే సామూహిక వనభోజనాలు

ప్రత్యేక పూజల అనంతరం గ్రామస్థులంతా కలిసి సంజీవరాయని గుట్టపైనే పచ్చిపులుసు, పప్పు వంటి వంటకాలు వండుకుని సామూహికంగా భోజనాలు చేశారు. గుట్టపై వంటలు చేసుకుని సామూహికంగా భోజనం చేయడం తమ గ్రామంలో ఎప్పటినుంచో కొనసాగుతున్న ఆనవాయితీ అని గ్రామస్థులు తెలిపారు.

గ్రామమంతా ఏకమై భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమం స్థానికంగా ఆకట్టుకుంది. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, చెరువులు, కుంటలు నిండాలని, గ్రామంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us