Siddept: సిద్ధిపేటలో సర్పంచ్‌ అత్యుత్సాహం.. మహిళ ఫొటో స్టేటెస్‌ పెట్టి, ఐ లవ్‌ యూ అంటూ వెకిలి చేష్టలు.

|

May 05, 2023 | 2:20 PM

సిద్ధిపేట జిల్లా రంగాయపల్లికి చెందిన సర్పంచ్‌ నాగభూషణం బరితెగించారు. గ్రామానికి చెందిన ఓ ఫొటోను వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టాడు నాగభూషణం. అంతటితో ఆగకుండా ఐ లవ్‌ యూ అంటూ పోస్ట్‌ చేశాడు. దీంతో సర్పంచ్‌ స్టేటస్‌తో తలెత్తుకోలేక సదరు మహిళ ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఈ విషయం తెలిసిన...

Siddept: సిద్ధిపేటలో సర్పంచ్‌ అత్యుత్సాహం.. మహిళ ఫొటో స్టేటెస్‌ పెట్టి, ఐ లవ్‌ యూ అంటూ వెకిలి చేష్టలు.
Siddipet
Follow us on

సిద్ధిపేట జిల్లా రంగాయపల్లికి చెందిన సర్పంచ్‌ నాగభూషణం బరితెగించారు. గ్రామానికి చెందిన ఓ ఫొటోను వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టాడు నాగభూషణం. అంతటితో ఆగకుండా ఐ లవ్‌ యూ అంటూ పోస్ట్‌ చేశాడు. దీంతో సర్పంచ్‌ స్టేటస్‌తో తలెత్తుకోలేక సదరు మహిళ ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఈ విషయం తెలిసిన మహిళ భర్త తన కుటుంబం పరవుతీశాడని మనోహరాబాద్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

తన సంసారాన్ని సర్పంచ్‌ సర్వశానం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సర్పంచ్‌ నాగభూషణంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని రంగాయపల్లి అధికారపార్టీ సర్పంచ్‌ నాగభూషణం బరితెగించిపోయాడు. గ్రామంలోని ఓ మహిళ ఫోటోను తన ఫోన్‌లో స్టేటస్‌గా ఐ లవ్‌ యూ బంగారం అని పెట్టుకోవడంతో ఆ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. అధికారమదంతో సర్పంచ్‌ నాగభూషణం ఊరిలో మహిళలపై దౌర్జన్యం చేస్తున్నారని, అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని భర్త డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..