Governor Tamilisai: తెలంగాణ గవర్నర్‌ టూర్‌లో మరోసారి ప్రొటోకాల్‌ వివాదం.. తమిళిసై పర్యటనలో కనిపించని అధికారులు..

తెలంగాణలో గవర్నర్ తమిళిసైకి అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆమె ఎక్కడికి వెళ్లినా అక్కడి అధికారులు గవర్నర్‌కు ప్రొటోకాల్‌ పాటించడం మానేశారు. తాజా ఇవాళ కూడా అదే జరిగింది.

Governor Tamilisai: తెలంగాణ గవర్నర్‌ టూర్‌లో మరోసారి ప్రొటోకాల్‌ వివాదం.. తమిళిసై పర్యటనలో కనిపించని అధికారులు..
Governor Tamilisai

Updated on: Nov 10, 2022 | 2:13 PM

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పర్యటనలో మరోసారి ప్రొటోకాల్‌ ఇష్యూ తెరపైకి వచ్చింది. ఆమె ఎక్కడికి వెళ్లినా అక్కడి అధికారులు ఆమెకి స్వాగతం పలుకుతున్న పాపాన పోవడం లేదు. పలుమార్లు ఈ విషయమై గవర్నర్ తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా అధికారులు మాత్రం ప్రోటోకాల్‌ను పట్టించుకోవడం లేదు. అయితే తాజాగా సిద్దిపేట జిల్లాలో గవర్నర్ తమిళిసైకి మరోసారి అవమానం జరిగింది. గవర్నర్‌ టూర్‌లో కూడా కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌ ఎక్కడా కనిపించలేదు. కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గవర్నర్‌ కామెంట్స్‌ చేసిన 24 గంటల్లోనే మళ్లీ ప్రోటో కాల్‌ రగడ తెరపైకి వచ్చింది. నా ప్రోటాకల్ విషయంలో ఎం జరుగుతుందో అందరికి తెలిసిన విషయమే.. కోమరవేల్లి రైలు అవసరం అని.. నేను హైదరాబాద్ పోగానే రైల్వే మంత్రితో మాట్లాడుతానని అన్నారు.

గవర్నర్‌కు మరోసారి అవమానం

గురువారం సిద్దిపేట జిల్లాలో గవర్నర్ తమిళిసై కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వెళ్లారు. డీఆర్‌వో, ఆలయ అర్చకులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. ప్రొటోకాల్‌ అంశంలో అసంతృప్తి తెలుపుతూ ఇటీవల గవర్నర్ వ్యాఖ్యలు చేశారు. అయినా అధికారులు తీరు మార్చుకోవడం లేదు. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ పర్యటనలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు హాజరు కావడం లేదు.తన పర్యటనలో ప్రోటోకాల్ పాటించడం లేదని గవర్నర్ కూడ ప్రకటించారు.తనకు  ప్రోటోకాల్ ఇవ్వకపోవడాన్ని పట్టించుకోవడం లేదని  గవర్నర్  ప్రకటించారు. ఇవాళ గవర్నర్ టూరులో కూడ జిల్లా ఉన్నతాధికారులు పాల్గొనలేదు.

ప్రభుత్వం తీరుపై విమర్శలు..

బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన గవర్నర్ ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. తన  ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారోమోననే అనుమానం వ్యక్తం చేశారు గవర్నర్. మొయినాబాద్ ఫాం హౌస్ అంశంలో రాజ్ భవన్ ను లాగే ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించారు.  తన పర్యటలో ప్రోటోకాల్‌ పాటించడం లేదని నిన్ననే గవర్నర్‌ తమిళిసై కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే.. ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కాగా.. కొమరవెల్లి మల్లన్న దర్శనం పూర్తి చేసుకొని తమిళిసై దూల్మిట్ట మండలం బైరాన్ పల్లి గ్రామానికి వెళ్లారు. బైరాన్ పల్లి గురించి కొంతమంది విద్యార్థులు నాకు చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు నాతో బైరాన్ పల్లి పోరాట చరిత్రను చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఒక్క సారి బైరాన్ పల్లికి రావాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తే వచ్చానని అన్నారు.

గవర్నర్‌ను రీకాల్‌ చేయండి..

గవర్నర్ తమిళిసైని వెంటనే రీకాల్‌ చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ తమిళిసై రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజాదర్బార్‌ పెట్టేహక్కు గవర్నర్‌కు ఎక్కడుందని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళిసై ఓ రాజకీయ నాయకురాలిగా ఉపన్యాసం ఇచ్చారని విమర్శించారు. గవర్నర్‌ వ్యవస్థ పనికిరాదని ఎప్పటి నుంచో చెబుతున్నామన్నారు. గవర్నర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాప్రభుత్వాలు ఆమోదించిన బిల్లులకు అడ్డుపడతారా అని ప్రశ్నించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం