Siddipet: సిద్దిపేట జిల్లాలో రెచ్చిపోయిన గ్రామస్థులు.. మీసేవ సెంటర్‌పై దాడి, కారణమేంటంటే..

Siddipet: సిద్దిపేట జిల్లా ఇటిక్యాల గ్రామస్థులు రెచ్చిపోయారు. గ్రామంలో ఉన్న మీసేవ సెంటరపై మూకుమ్మడి దాడి చేసి, ధ్వంసం చేశారు. ఇంతకీ మీ సవే సెంటర్లపై గ్రామస్థులు దాడి చేయడానికి కారణమేంటి.? వారికి అంత...

Siddipet: సిద్దిపేట జిల్లాలో రెచ్చిపోయిన గ్రామస్థులు.. మీసేవ సెంటర్‌పై దాడి, కారణమేంటంటే..
Attack On Meeseva

Updated on: Sep 24, 2022 | 8:47 AM

Siddipet: సిద్దిపేట జిల్లా ఇటిక్యాల గ్రామస్థులు రెచ్చిపోయారు. గ్రామంలో ఉన్న మీసేవ సెంటరపై మూకుమ్మడి దాడి చేసి, ధ్వంసం చేశారు. ఇంతకీ మీ సవే సెంటర్లపై గ్రామస్థులు దాడి చేయడానికి కారణమేంటి.? వారికి అంత ఆగ్రహం ఎందుకు వచ్చిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. వివరాల్లో వెళితే.. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం ఇటిక్యాలలో మీసేవ సెంటర్‌ నిర్వాహకులు భూరికార్డుల పేరిట అవకవతకలకు పాల్పడ్డారంటూ సెంటర్‌పై మూకుమ్మడిగా దాడిచేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మించి వసూలు చేస్తున్నారని ఆగ్రహించారు. పెద్ద అధికారులు తెలుసంటూ భూసమస్యల పేరిట భారీగా డబ్బు గుంజారని ఆరోపించిన బాధితులు ఆగ్రహంతో ఊగిపోయారు.

మీసేవ అక్రమాలపై విచారణకు వచ్చిన ఆర్‌ఐ కళ్లెదుటే మహిళలు కర్రలతో విధ్వంసం సృష్టించారు. సెంటర్‌లో ఉన్న కంప్యూటర్లను ధ్వంసం చేశారు. అద్దాలను పగులగొట్టారు. ప్రింటర్లను బయటకు తెచ్చి నేలకేసి కొట్టారు. మహిళల దాడిని అడ్డుకున్న మీసేవ నిర్వాహకురాలిపై కర్రలతో దాడిచేశారు. తనభార్యను కొడుతున్న మహిళలను అడ్డుకోబోయిన మీసేవ నిర్వాహకురాలి భర్తపైనా పురుషులు దాడికి దిగారు. కర్రతో వెంటాడి వెంటాడి కొట్టారు. మీసేవ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్‌, కంప్యూటర్‌లను బయటకు విసిరేశారు. వారికి సహకరించినట్లు అనుమానించిన వ్యక్తిపై కూడా మహిళలు ఇష్టానుసారం దాడి చేశారు. ఈ దాడుల్లో పలువురికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..