Save Trees: హరిత హారం చెట్టు కొమ్మలు నరికినందుకు రూ.5వేల జరిమానా.. ఎక్కడంటే..

|

Nov 06, 2021 | 2:48 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం చెట్లను నరికినందుకు గాను అధికారులు రూ.5వేల జరిమానా విధించారు. ఈ సంఘటన సూర్యాపేలో శనివారం చోటుచేసుకుంది..

Save Trees:  హరిత హారం చెట్టు కొమ్మలు నరికినందుకు రూ.5వేల జరిమానా.. ఎక్కడంటే..
Follow us on

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం చెట్లను నరికినందుకు గాను అధికారులు రూ.5వేల జరిమానా విధించారు. ఈ సంఘటన సూర్యాపేలో శనివారం చోటుచేసుకుంది. ‘ తెలంగాణకు హరితహారం’లో పట్టణంలోని జనగామ రోడ్డులోని ప్రవీణ్ ట్రేడర్స్‌ దుకాణం ముందు చెట్టు నాటారు. అయితే దుకాణదారులు ఆ చెట్టు కొమ్మలను నరికేశారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్‌ కమిషనర్‌ పి. రామాంజుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత దుకాణ యజమానికి రూ. 5వేలు జరిమానా విధించారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ‘తెలంగాణకు హరితహారం’ పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున చెట్ల పెంపకాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది 7 వ హరితహారంలో భాగంగా ఇప్పటికే 20 కోట్ల మొక్కలు నాటినట్లు ఇటీవల ప్రభుత్వం తెలిపింది. దీంతో పాటు ఈ కార్యక్రమానికి అనుసంధానంగా ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’, ‘పల్లె ప్రగతి’, ‘పట్టణ ప్రగతి’ పేరుతో పట్టణాలు, గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతోంది. వీటి పరిరక్షణ బాధ్యతలను అధికారులు, ప్రజాప్రతినిధులకు అప్పగిస్తోంది. ఇందులో భాగంగానే చెట్ల నరికివేసిన వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తున్నారు.

Also Read:

Komatireddy Venkat Reddy: రేపటినుంచి నా తడాఖా ఎంటో చూపిస్తా.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Hyderabad News: హైదరాబాద్‌లో దారుణం.. ట్రయిల్ రూమ్‌లో కెమెరాలు.. విస్తుపోయే నిజాలు..

Crime News: చిల్లర డబ్బుల కోసం డిమాండ్.. మాట వినకుంటే హతం.. 15 రోజుల్లో 3 హత్యలు.. సైకో కిల్లర్ అరెస్ట్