
సమ్మర్ వచ్చేసింది. బయట ఎండు మండిపోతున్న.. భానుడి భగభగలకు మానవులం మనమే తట్టుకోలేకపోతున్నాం, ఇక మూగజీవులు, క్షీరదాల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఎక్కడ చల్లగా అనిపిస్తే అందులోకి దూరేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. బయట వేడిని తట్టుకోలేక ఓ పాము ఇంటి దగ్గర పార్క్ చేసిన ఓ బైక్‌లోకి దూరింది. అది గమనించకుండా బైక్ డ్రైవ్ చేసిన వ్యక్తి మార్గ మధ్యలో పామును చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కుకుట్లపల్లి గ్రామానికి చెందిన జంగా ప్రశాంత్ అనే వ్యక్తి తన పల్సర్ బైక్ పై బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఎప్పటిలాగే ఇంటి వద్ద పార్క్ చేసిన బైక్ తీస్తుండగా అతనికి బైక్ ముందు భాగం నుంచి ఏవో వింత శబ్ధాలు వినిపించాయి. అనుమానం వచ్చి ఏంటా అని క్షుణ్నంగా పరిశీలించి చూడగా.. బైక్ డోమ్ లోపల నాగు పాము తిష్టవేసిన దృశ్యం కనిపించింది. అది చూసిన ప్రశాంత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
దీంతో భయాందోళనకు గురైన ప్రశాంత్ వెంటనే కేకలు వేసి స్థానికులకు సమాచారం అందించాడు..గ్రామస్తులు అక్కడికి చేరుకుని సుమారు అరగంట పాటు తీవ్రంగా శ్రమించి బైక్ డోమ్ భాగాలను విప్పి, అతి కష్టం మీద ఆ నాగుపామును బయటకు పారదోలారు..అప్పటివరకు ప్రాణభయంతో వణికిపోయిన ప్రశాంత్ కుటుంబం పాము వెళ్ళిపోవడంతో ఊపిరి పీల్చుకుంది. అక్కడే ఉన్న కొందరు ఇందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఈ ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.