
హైదరాబాద్, డిసెంబర్ 14: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత నానాటికీ పెరిగిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, తూర్పు తెలంగాణ, పశ్చిమ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు, రేపు చలిగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత తారా స్థాయికి చేరింది. దట్టంగా పొగమంచు అలుముకోవడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోతున్నాయి. శనివారం మినుములూరు 5, అరకులో 5, అరకు 7, పాడేరు 7 డిగ్రీల చొప్పున అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి గిరిజనం చలి మంటలు వేసుకుంటున్నారు. దట్టంగా పొగ మంచు కప్పడంతో రోడ్లపై వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్తున్నారు. మరో 3 రోజులు చలి గాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని, చిన్నారులు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.