తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.. మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఏడుగురు గల్లంతయ్యారు.. వారిలో ఐదుగురు మరణించారు.. ఇద్దరిని స్థానికులు కాపాడారు.. చనిపోయిన వారంతా 20 ఇళ్లలోపు వారే ఉన్నారు.. వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన యువకులు శనివారం కొండపోచమ్మ సాగర్ డ్యాం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఈత కొట్టెందుకు దిగి.. అంతా మునిగిపోయారు.. ఏడుగురు యువకులు కూడా గల్లంతయ్యారు.. వారిలో ఐదుగురు నీట మునిగి చనిపోయారు.. ఇద్దరిని.. స్థానికులు కాపాడారు..
మృతులు ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ధనుష్ (20), లోహిత్ (లక్కీ) (17), చీకట్ల దినేశ్వెర్ (17), సాహిల్ (19), జతిన్ (17) గా గుర్తించారు.. కోమరి మృగంక్, ఎండి ఇబ్రహీం ఇద్దరూ బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సెల్ఫీ కోసం డ్యామ్‌లోకి యువకులంతా డ్యాంలోకి దిగారు.. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఏడుగురు డ్యామ్‌లోకి దిగారని పేర్కొంటున్నారు.. ఐదుగురు నీటిలో మునిగారు.. వీరిలో ఇద్దరు బయటపడ్డారని స్థానికులు తెలిపారు.
కొండపోచమ్మ సాగర్ డ్యాంలో గల్లంతై ఐదుగురు మరణించడంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.. గజ ఈతగాళ్లను రంగలోకి దించాలని.. అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి