Telangana: సౌండ్ ఎక్కువ చేస్తే వైలెంట్ అయిపోయి.. సింపుల్‌గా మర్డర్ చేస్తాడు

హైదరాబాద్‌లో రాహుల్ అనే నిందితుడిని జి ఆర్ పి పోలీసులు అరెస్టు చేశారు. ట్రైన్‌లో ఒక మర్డర్ కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేయగా అతడి లైఫ్ స్టైల్ తెలుసుకొని పోలీసులు షాక్ అవుతున్నారు.. సీరియల్ కిల్లర్‌ అయినప్పటికీ, అతని ప్రవర్తనలోని కొన్ని అసాధారణమైన లక్షణాలు పోలీసులను విస్మయానికి గురిచేశాయి.

Telangana: సౌండ్ ఎక్కువ చేస్తే వైలెంట్ అయిపోయి.. సింపుల్‌గా మర్డర్ చేస్తాడు
Rahul

Edited By:

Updated on: Feb 08, 2025 | 3:57 PM

నిందితుడు రాహుల్ వయసు 29 సంవత్సరాలు. అతని జీవితంలో రెండు ముఖ్యమైన వ్యసనాలు ఉన్నాయి. బీడీలు కాల్చడం.. పాలు తాగడం. నేరాల ద్వారా సంపాదించిన డబ్బుతో అతను పాలు, బీడీలు కొంటూ ఉంటాడు.  వీటిని కొనుక్కునేందుకే అతడు దొంగతనాల బాట పట్టాడు.  చిన్నతనంలో జరిగిన ప్రమాదం కారణంగా అతని ఎడమ కాలు శాశ్వతంగా దెబ్బతిన్నది. వైద్యం అందకపోవడంతో అతను శారీరకంగా వికలాంగుడిగా మారాడు. ఈ పరిస్థితుల కారణంగా అతని సమాజంపై కోపం ఏర్పడింది. అలాగే  శబ్దాలు వింటే చిరాకుతో చిర్రెత్తుకొచ్చేది. దీంతో చిన్న చిన్న విషయాలకే మనుషులను చంపడం స్టార్ట్ చేశాడు.

కొద్దిరోజుల క్రితం బెలగావి-మణుగూరు ప్రత్యేక రైలులో రాహుల్ బీడీ తాగుతుండగా ఓ మహిళ అసహనం వ్యక్తం చేసింది. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో రాహుల్ కోపం నషాలానికి ఎక్కింది. ఆమెను రైలు నుంచి తోసి హత్య చేశాడు.ఈ హత్య తర్వాత రాహుల్ క్రమంగా మరిన్ని నేరాలకు పాల్పడటం ప్రారంభించాడు. చిన్నచిన్న గొడవల కారణంగా అతను మరో ముగ్గురిని హత్య చేశాడు. అతని చర్యల వెనుక ప్రధాన అంశాలు కోపావేశం, అతని మానసిక స్థితి. అలానే చుట్టూ ఉన్న సమాజంపై వ్యతిరేకత.

హత్యలు జరిగిన తీరు, సాక్ష్యాలు, రాహుల్ ప్రవర్తన చివరకు అతని పట్టుబడేలా చేశాయి. పోలీసులు ఇంకా అతని నేరాల గురించి వివరాలు సేకరిస్తూనే ఉన్నారు.రా హుల్ తన నేరాల ద్వారా సంపాదించిన డబ్బుతో బీడీలు, పాలు కొనుగోలు చేసేవాడు. అప్పుడప్పుడు రైల్వే స్టేషన్‌ల దగ్గర బీడీలు కొంటూ కనిపించేవాడు. అలాగే, ఉచిత భోజన కేంద్రాల్లో తిని జీవించేవాడు. ప్రస్తుతం హైదరాబాద్ జిఆర్పి పోలీసులు అతని అరెస్టు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.