Audio Tape: సంచలనం సృష్టిస్తున్న ఆడియో టేప్‌ లీక్‌లు.. మారుతున్న నేతల తలరాతలు.. ప్రముఖుల ఆడియో టేపుల వివరాలు..

|

Jul 12, 2021 | 8:41 PM

Audio Tape Leaks: తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నిక సరికొత్త రాజకీయ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది. తాజా వ్యవహారంతో..

Audio Tape: సంచలనం సృష్టిస్తున్న ఆడియో టేప్‌ లీక్‌లు.. మారుతున్న నేతల తలరాతలు.. ప్రముఖుల ఆడియో టేపుల వివరాలు..
Phone Calls
Follow us on

Audio Tape Leaks: తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నిక సరికొత్త రాజకీయ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది. తాజా వ్యవహారంతో.. ఇటీవలి కాలంలో వరుసగా లీక్ అవుతున్న నేతల ఆడియో టేప్‌ల వ్యవహారం లైమ్‌లైట్‌లోకి వచ్చింది. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కౌశిక్ రెడ్డి.. అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని విపరీతమైన ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి ఊతమిస్తూ.. తాజాగా లీక్ అయిన కౌశిక్ రెడ్డి ఫోన్‌ కాల్ ఆడియో టేప్ బలమైన ఆధారంగా నిలిచింది. ఆ ఫోన్ కాల్‌లో కౌశిక్ రెడ్డి.. తనకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ కన్ఫామ్ అయ్యిందని, యువతకు అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పడం విశేషం. ఇప్పుడీ ఆడియో టేప్ తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా హుజూరాబాద్‌లో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ ఆడియో టేప్ కారణంగా కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాజీనామా చేశారు కూడా.

అయితే, ఈ ఆడియో టేప్ లీక్‌ ల కలకం.. తెలంగాణలోనే కాదు.. దేశ వ్యాప్తంగా నేతల తల రాతలు మారుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నేతల వరకు ఈ ఆడియో టేప్ లీకేజీ బాధితులు ఎంతో మంది ఉన్నారు. వాటిలో ముఖ్యమైన.. తీవ్ర వివాదం అయిన వాటిని ఇప్పుడు పరిశీలిద్దాం.

1. 2015, మార్చిలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ మాట్లాడినట్లు పేర్కొన్న టేప్ లీక్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకుంటున్నాం’ అన్నట్లుగా ఆ లీక్‌డ్ టేప్‌లో ఉంది. ఇది జరిగిన మరుసటి రోజే మరో ఆడియో టేప్‌ కూడా లీక్ అయ్యింది.’మోడీ వేవ్ ను ఆపాలంటే ముస్లింలకు ఆప్ తప్ప వేరే అకాశం లేదు’ అని కేజ్రీవాల్ అన్నట్లు మరో ఆడియో టేప్‌లో ఉంది.
2. 2017 డిసెంబర్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై మహారాష్ట్ర కాంగ్రెస్ మాజీ కార్యదర్శి షెహజాద్ పూనావాలా, మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ సంభాషణల టేప్ లీక్ అయ్యింది. ఈ ఆడియో టేప్‌లో ‘రహస్య బ్యాలెట్ వద్దు. ఎప్పటివరకు వారసత్వ పాలన మేధావులపై ఆధిక్యత కనబరుస్తుంది’ అన్న ప్రశ్నకు జవాబుగా తివారీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నిజానికి కాంగ్రెస్ యాజమాన్య సంస్థ. దేశంలో ఏ పార్టీ యజమానిని కలిగిలేదు’ అన్న వ్యాఖ్యలు కూడా లీక్ అయ్యాయి.
3. 2019 ఫిబ్రవరిలో.. ప్రియాంక గాంధీపై ‘చాకోలేట్ ముఖాలు’ అంటూ సంబోధిస్తూ బెంగాల్ బీజేపీ ఇన్ చార్జ్ కైలాశ్ విజయవర్గీయా.. పార్టీ నేత ముకుల్ రాయ్‌తో అన్న ఆడియో టేప్ లీక్ పెను సంచలనం సృష్టించింది.
4. 2021, మార్చిలో.. పశ్చిమ బెంగాల్‌లో శాసనసభ ఎన్నికల సందర్భంగా సీఎం మమతా బెనర్జీ ఆడియో టేప్ కూడా లీక్ అయ్యింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన నందిగ్రామ్‌ ప్రాంతానికి చెందిన నేత ప్రళయ్‌ పాల్‌ను సొంత గూటికి రావాలని బుజ్జగిస్తున్నట్లుగా ఈ ఆడియో టేప్‌లో ఉంది.
5. 2021, ఏప్రిల్‌లో.. కూచ్ బెహార్ ఘటనలో ప్రాణాలు వదిలిన వ్యక్తుల మృతదేహాలతో ర్యాలీ చేయాలంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తృణమూల్.. కాంగ్రెస్ అభ్యర్థి పార్థ ప్రతిమ్ రాయ్‌కు సూచించినట్టుగా ఓ ఆడియో టేప్ లీక్ అయ్యింది. అయితే, దీనిని బీజేపీ కుట్ర అని టీఎంసీ నేతలు ఆరోపించారు.
6. 2021, ఏప్రిల్‌లో.. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి బెదిరింపులకు దిగాడని ఓ ఆడియో టేప్ లీక్ అయ్యింది. ఈ ఆడియో టేప్‌లో ‘‘సర్పంచ్ కి ఇస్తే సరిపోద్దా.. మా సంగతేంటి?’’ అని మల్లారెడ్డి వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉంది. దీనికి మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
7. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో చంద్రబాబు జరిపిన సంభాషణ టేప్ లీక్..’హీ బ్రీఫ్డ్ మి’ అని చంద్రబాబు మాట్లాడినట్లుగా ఆ టేప్‌లో ఉంది.
8. 2019లో కుమారస్వామి సీఎంగా కాంగ్రెస్-జేడీ-ఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమైన ఎమ్మెల్యేల తిరుగుబాటు అంశం. అమిత్ షా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారట అని సీఎం యడియూరప్ప తమ పార్టీ కార్యకర్తలతో జరిపిన సంభాషణ తాలూకు ఆడియో క్లిప్ లీక్ అవడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

ఇలా గత కొంతకాలంగా నేతల ఫోన్ కాల్స్‌ సంభాషణలకు సంబంధించి ఆడియో టేప్‌లు లీక్ అవడం సంచలనం సృష్టిస్తోంది.

Also read:

Viral Video: చిన్నారి అభిమానానికి సెర్బియా దిగ్గజం ఫిదా… బహుమతిగా ఏమిచ్చాడో తెలుసా?

‘కొంగు నాడు’ వివాదం.. తమిళనాడును విభజించే ప్రసక్తి లేదు.. బీజేపీ హైకమాండ్ క్లారిటీ