Komatireddy Venkat Reddy: రేపు ప్రధానితో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ.. పార్టీ మార్పుపై ఊహాగానాలు..?

| Edited By: Ram Naramaneni

Dec 15, 2022 | 6:33 PM

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇప్పటికే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రేపు (శుక్రవారం) ప్రధాని మోడీతో భేటీ...

Komatireddy Venkat Reddy: రేపు ప్రధానితో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ.. పార్టీ మార్పుపై ఊహాగానాలు..?
Komatireddy Venkatreddy
Follow us on

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇప్పటికే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. శుక్రవారం ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. అతని సోదరుడు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుతో.. ఇప్పుడు వెంకట్ రెడ్డి కూడా పార్టీ మారనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీతో భేటీ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అభివృద్ధి పనులకు సంబంధించి ప్రధాని అపాయింట్మెంట్ కోరిన ఎంపీ.. మూసీ ప్రక్షాళన, నేషనల్ హైవే ఇష్యూస్ కి సంబంధించి ప్రధానమంత్రి తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం రోజు రోజుకూ ముదురుతోంది. గతంలోనే వర్గాలుగా విడిపోయి.. అంతర్గత పోరుకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన కాంగ్రెస్.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ కు వేదికగా మారింది.

ముఖ్యంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతం పార్టీ వేసిన కమిటీల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చోటు దక్కలేదు. సమయం వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడతానని.. ఇంకా కేంద్ర కమిటీలు వేసే అవకాశం ఉందని గతంలో చెప్పారు. అంతే కాకుండా పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో రచ్చ జరుగుతున్న సమయంలో ఆయన ప్రధానిని కలవబోతున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఒక ఎంపీగా ప్రధానితో సమావేశం జరగడం కామన్ అని కోమటిరెడ్ది సన్నిహితులు చెబుతుండటం గమనార్హం.

మరోవైపు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని ఖర్గేకు వివరించారు. ఇటీవల ప్రకటించిన పీసీసీ కమిటీల్లో పలువురు సీనియర్ల పేర్లు లేకపోవడాన్ని ఖర్గే వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటుందని ఈ సందర్భంగా కోమటిరెడ్డితో ఖర్గే చెప్పినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..