AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మెదక్ జిల్లాలో దారుణం.. కారులో అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగి సజీవదహనం

కారులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో సజీవ దహనమయ్యాడు. అయితే అర్థరాత్రి కారుతో సహా అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Telangana: మెదక్ జిల్లాలో దారుణం.. కారులో అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగి సజీవదహనం
Suspect Death
Sanjay Kasula
|

Updated on: Jan 09, 2023 | 3:05 PM

Share

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురం శివారులో దారుణం జరిగింది. కారులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో సజీవ దహనమయ్యాడు. అయితే అర్థరాత్రి కారుతో సహా అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కారు సమీపంలో ఒక బ్యాగు, పొదల్లో పెట్రోల్ డబ్బాను గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. జరిగిన ఘటనను పరిశీలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడు సచివాలయంలో పనిచేసే సీనియర్‌ అసిస్టెంట్‌ పాతులోతు ధర్మగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అసలేం జరిగిందన్న అంశంపై విచారణ జరుపుతున్నారు.

తన భర్త ఇక లేడన్న వార్తతో కన్నీరుమున్నీరవుతోంది అతని భార్య. తమ మధ్య గొడవలేం లేవని..ఎవరి మీదా తమకు అనుమానాలు లేవంటూ భోరున విలపిస్తోందామె. ధర్మ సజీవదహనం మిస్టరీగా మారింది. కారులో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగిందా..? లేక ఇంకేదైనా కోణముందా..? అన్నది పూరదర్యాప్తు తర్వాతే తేలుతుందంటున్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం