
సికింద్రాబాద్ అండ్ మల్కాజిగిరి.. ఈ రెండిటి మధ్య పోటీ మొదలైందిప్పుడు. ఔటర్ లోపల ఉన్న మొత్తం నగరాన్ని 300 వార్డులుగా చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు దాన్ని 3 కార్పొరేషన్లుగా డివైడ్ చేయాలనే ప్రతిపాదన వినిపిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పేరుతో కార్పొరేషన్లు తీసుకొచ్చే ప్లాన్ కనిపిస్తోంది. ఈ మల్కాజిగిరి కార్పొరేషన్‌లో సికింద్రాబాద్ ఉంటుందనేది ఓ వాదన. సరిగ్గా ఈ ప్రతిపాదనే కొత్త సెంటిమెంట్ రాజేసింది. ఒక రాజకీయ వివాదంగా మారింది. సికింద్రాబాద్‌కు 220 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. అలాంటి సికింద్రాబాద్ 1956 వరకు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌గానే ఉండేది. ఆ తర్వాత హైదరాబాద్‌లో విలీనమైంది. రింగ్ రోడ్ లోపలున్న ప్రాంతమంతా జీహెచ్ఎంసీనే అనే నిర్ణయం తీసుకునేంత వరకు.. సికింద్రాబాద్ జోన్, సికింద్రాబాద్ సర్కిల్ ఉండేది. బట్.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఓ నెల క్రితం తీసుకున్న నిర్ణయంతో సికింద్రాబాద్ సర్కిల్ అనే పేరే కనుమరుగైంది. అటు సికింద్రాబాద్ జోన్ పరిధి మాత్రం పూర్తిగా మారింది. ఇప్పుడు మూడే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, అందులో సికింద్రాబాద్‌ను మల్కాజిగిరిలో కలిపేస్తే.. సికింద్రాబాద్ తన స్వయంప్రతిపత్తిని, చారిత్రకతను కోల్పోతుందనేది కొందరి వాదన. అందుకే, ‘మల్కాజ్‌గిరిలో విలీనం వద్దు – సికింద్రాబాద్‌కు ప్రత్యేక కార్పొరేషన్ ముద్దు’ అనే నినాదంతో ఆందోళనలు చేస్తున్నారు. ఈ కాలంలోనూ ఇంకా కంటోన్మెంట్లు ఏంటంటూ.. కేంద్ర రక్షణ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డ్ ఏరియాలను.. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లలో కలపాలని 2023లో నిర్ణయం...