కష్ట, సుఖాల్లో తోడు నీడగా ఉంటానని చేసిన ప్రమాణాన్ని మార్చిపోయి తాళిని ఎగతాళి చేశాడు ప్రబుద్ధుడు. నీవు లేక నేను ఉండలేనంటూ మాయ మాటలు చెప్పాడు. పెళ్లి చేసుకున్న విషయాన్ని దాచి పెట్టాడు. ఈ విషయం బాధితురాలికి తెలియడంతో.. ఆ ప్రబుద్దుడి తాట తీసింది. ఏకంగా అతని ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టింది.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలానికి చెందిన దేవేందర్ అనే నిత్య పెళ్లి కొడుకు యవ్వారం వెలుగులోకి వచ్చింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే పెద్దపల్లి మండలం కన్నాల గ్రామానికి చెందిన నాగుల సౌజన్యతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఐదు సంవత్సరాలు సజావుగా కాపురం చేశాడు. మొదటి పెళ్లి విషయాన్ని దాచి పెట్టారు. తరువాత దేవేందర్ తన నిజ స్వరూపాన్ని బయట పడింది. వరకట్న పిశాచి అవహించిన దేవేందర్ కుటుంబం సౌజన్యను నిత్యం వేధింపులకు గురి చేశారు. అదనపు కట్నం తీసుకు రావాలని అత్తమామలతో కలిసి నరకం చూపించారు. ఇది నిత్యకృత్యంగా మారింది.
అయితే దేవేందర్ రెండు పెళ్లిళ్లు చేసుకుని ముచ్చటగా మూడో పెళ్లికి రెఢి అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న సౌజన్య, తనకు న్యాయం చేయాలంటూ నిత్య పెళ్లి కొడుకు దేవేందర్‌ను నిలదీసింది. ఏకంగా ఇంటి ముందు సౌజన్య కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి బైఠాయించింది. తనకు జరిగిన అన్యాయాన్ని మరోక అమ్మాయికి జరగకుండా ఉండాలని, దేవేందర్‌ను కఠినంగా శిక్షించి, తనకు న్యాయం చేయాలని కోరుతుంది. డబ్బుల కోసం మరో పెళ్లికి కూడా సిద్ధమాయ్యడు. ఈ విషయం రెండవ భార్యకు తెలియడం తో నిలదీశారు. మహిళల ను మోసం చేస్తున్న దేవేందర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి మహిళా సంఘాలు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..