Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య స్పెషల్‌ ట్రైన్స్‌..

|

Nov 10, 2021 | 8:10 AM

SCR Special Trains: ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని వివిధ ప్రాంతాల నుంచి ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం

Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య స్పెషల్‌ ట్రైన్స్‌..
Special Trains
Follow us on

SCR Special Trains: ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని వివిధ ప్రాంతాల నుంచి ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. నవంబర్‌ 17, 24 తేదీల్లో స్పెషల్ ట్రైన్స్‌ను నడపనున్నట్లు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వీక్లీ స్పెషల్‌ రైలు (08586) నడుపుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే నవంబర్‌ 16, 23 తేదీల్లో విశాఖపట్నం- సికింద్రాబాద్‌ మధ్యన ప్రత్యేక రైలు (08585) సర్వీసులను నడపనున్నారు. ఆయా తేదీల్లో రాత్రి 9:05 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరనున్న రైలు తర్వాతి రోజు ఉదయం 9:50 గంటలకు విశాఖ చేరుతుంది. అలాగే విశాఖలో ఈ నెల 16, 23 తేదీల్లో సాయంత్రం 5:35 గంటలకు బయల్దేరనున్న రైలు ఆ తర్వాతి రోజు ఉదయం 7:10 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. స్పెషల్ రైళ్లకు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ నల్గొండ స్టేషన్‌లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

Also Read:

PM Modi: అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ప్రధాని మోడీ.. ట్విట్టర్‌ తాజా నివేదికలో అమెరికన్ సింగర్, సచిన్..

Crime News: జార్ఖాండ్‌లో దారుణం.. 8 మంది పిల్లల తండ్రికి 8వ తరగతి చదివే బాలికతో వివాహం