School Holiday: బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్.. రేపు స్కూళ్లకు సెలవ్‌! ఎందుకంటే

Telangana School Holidays 2025: భారీ వర్షాల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలోని స్కూళ్లకు వరుస సెలవులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోమారు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రేపు శనివారం (సెప్టెంబర్‌ 6) సెలవిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్కూళ్లతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా..

School Holiday: బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్.. రేపు స్కూళ్లకు సెలవ్‌! ఎందుకంటే
School Holiday

Updated on: Sep 05, 2025 | 2:01 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5: రాష్ట్రంలోని బడులకు సంబంధించి సర్కార్‌ మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు వరుస సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో మరోమారు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు శనివారం (సెప్టెంబర్‌ 6) సెలవిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్కూళ్లతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఇస్తున్నట్లు తాజాగా ప్రకటన వెలువరించింది. సెప్టెంబర్‌ 6న గణేశ్‌ నిమజ్జనం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు పబ్లిక్‌ హాలిడే ప్రకటించింది.

ఇక ఈ రోజు (సెప్టెంబర్ 5) మిలాద్-ఉన్-నబీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇక సెప్టెంబర్ 6న హైదరాబాద్ సహా.. రంగారెడ్డి, మేడ్చల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాల ప‌రిధిలోని అన్ని విద్యా సంస్థలకు గణేష్ నిమజ్జనం కారణంగా మరొక సెలవు వచ్చింది. ఇక సెప్టెంబర్ 7న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి.

అయితే సెప్టెంబ‌ర్ 6న సెల‌వు కార‌ణంగా అక్టోబ‌ర్ 11వ తేదీన వచ్చే రెండో శ‌నివారం రోజున సెలవు రద్దు చేసి, పని దినంగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్ధుల తల్లిదండ్రులు పర్యాటక ప్రదేశాలకు వరుస కట్టారు. వర్షాలు కూడా తగ్గుముఖం పట్టడంతో ప్రయాణాలకు టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. ఇక దసరా కూడా సమీపిస్తుండటంతో మరో విద్యార్దుల భారీగా వరుస సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దాదాపు 13 రోజుల పాటు దసరా పండగ సెలవులు రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.