Adilabad: స్కూల్ టీచర్ల గబ్బుదందా..సంఘ భవనమే అడ్డాగా గురువుల అకృత్యాలు..

|

May 12, 2022 | 2:51 PM

విద్యార్థులకు పాఠాలు చెబుతూ సమాజాన్ని సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాద్యాయులు. కానీ వాళ్లు చేస్తున్నది మాత్రం గబ్బు దందా.

Adilabad: స్కూల్ టీచర్ల గబ్బుదందా..సంఘ భవనమే అడ్డాగా గురువుల అకృత్యాలు..
Adb
Follow us on

వాళ్లంతా బావితరానికి బాటలువేయాల్సిన గురువులు. విద్యార్థులకు పాఠాలు చెబుతూ సమాజాన్ని సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాద్యాయులు. కానీ వాళ్లు చేస్తున్నది మాత్రం గబ్బు దందా. పాఠాలు నేర్పాల్సిన చేతులతో పేక ముక్కలను కలిపేస్తున్నారు.. విద్యార్థులను తీర్చి దిద్దాల్సిన వాళ్లే మందు విందు మత్తులో జోగుతున్నారు. సంఘ భవనాన్నే పేకాట డెన్ గా మార్చుకుని యద్ధేచ్చగా కాయ్ రాజా కాయ్ గేమ్ లో తూలిపోతున్నారు. నిర్మల్ జిల్లా బైంసాలో మూడు పేకాలు ఆరు ఆటలుగా సాగుతోంది టీచర్స్ పేకాట గేమ్.

బైంసాలోని పీఆర్టీయూ భవన్‌లో టీచర్లు విచ్చలవిడిగా పేకాట ఆడుతున్న దృశ్యాలు అందరినీ అవాక్కయేలా చేశాయి..బైంసా పట్టణ నడిబొడ్డున జనావాసాలకు మద్యన ఉపాద్యాయ సంఘ భవనం ముసుగులో సాగుతున్న పేకాట జూదం డెన్ గుట్టు బట్టబయలు చేసింది టీవి9 టీం. పోస్టాఫీస్ గల్లీ కి సమీపంలోని పీఆర్టీయూ భవనంలో వీరికి కావాల్సిన సెట్టప్‌ అంతా రెడీ చేసుకున్నారు. బిల్డ్‌లో రెండు టేబుల్లు ఏర్పాటు చేసుకుని సాయంత్రం 4 గంటల నుండి అర్థరాత్రి 12 వరకు నిర్భయంగా, నిర్మోహమాటంగా గేమ్ ఆడేస్తున్నారు ఉపాద్యాయులు. మద్యం మత్తులో చిత్తుగా తూగుతూ పేకాట మత్తులో చిల్లవుతున్నారు.

నిబందనలు ఉల్లంగించి యదేచ్ఛగా జనావాసాల మద్యే పేకాట కొనసాగుతున్నా పోలీసులు మాత్రం చూసిచూడనట్టుగా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిని నిలదీయగా, ఇంత జరిగినా వారు పేకాట ఆటను సమర్దించుకుంటున్నారని సమాచారం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Tirupati: ఘనంగా ప్రారంభమైన తిరుపతి గంగమ్మ జాతర.. చెల్లెలకు శ్రీవారి తరపున సారెను పంపనున్న టీటీడీ..

Army TGC 136 Notification 2022: ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు ఇండియన్‌ ఆర్మీ ఉద్యోగాలు..నేరుగా ఇంటర్వ్యూ ద్వారా..