వనపర్తి జిల్లా సరళసాగర్ జలాశయానికి భారీ గండి పడింది. మదనాపురం మండలం శంకరమ్మపేట దగ్గర గండి ఏర్పడటంతో సరళసాగర్ జలాశయం నుంచి నీరు వృథాగా పోతోంది. పదేళ్ల తర్వాత సరళసాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గండిపడినట్టు తెలుస్తోంది. జలాశయానికి సరైన మరమ్మత్తులు, నిర్వహణ సరిగా చేపట్టకపోవడంతో ఇలాంటి ప్రమాదం జరిగిందని అంటున్నారు స్థానికులు. గేట్లు జామ్ కావడంతో ప్రాజెక్ట్ సామర్థ్యంకి మించి నీరు నిండిపోవడం వల్ల గండిపడిందని అధికారులు పేర్కొన్నారు. అయితే భారీగా నీరు కిందకి చేరడంతో వందలాది ఎకరాలు నీట మునిగే ప్రమాదం ముంది. మరో పక్క చుట్టుపక్కల గ్రామాల్లోకి నీరు చేరండంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.