Sankranti Holidays 2026: ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా?

Sankranti School Holidays 2026: ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు వర్తిస్తాయి. విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకునే అవకాశం కల్పిస్తుంది. అదనంగా పాఠశాలలు జనవరి 23న వసంత పంచమి/సరస్వతీ పూజ/సుభాష్ చంద్రబోస్ జయంతి, జనవరి 26న గణతంత్ర దినోత్సవం ..

Sankranti Holidays 2026: ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా?

Updated on: Nov 21, 2025 | 7:10 PM

Sankranti School Holidays 2026: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంక్రాంతి సెలవులు. పండగ సమీపిస్తుండటంతో ఎప్పటి నుంచి సెలవులు ఉంటాయోనని ఎదురు చూస్తున్నారు. అలాగే సంక్రాంతి పండగలకు ఊళ్లకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్స్‌ చేస్తుంటారు. ముందస్తుగా రైళ్లు, బస్సు టికెట్స్‌ను బుక్‌ చేసుకుంటున్నారు. సంక్రాంత్రికి ఇంకా నెలకుపైగా రోజులు ఉన్నప్పటికీ రైళ్ల టికెట్స్‌ అన్ని కూడా బుక్‌ అయిపోయాయి. పండుగ సెలవులు విద్యా షెడ్యూల్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వనున్నాయి. విద్యార్థులు తమ ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి వీలు కల్పిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే సంక్రాంతి సెలవుల తేదీలను నిర్ధారించింది. జనవరి 10 నుండి జనవరి 18, 2026 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. మొత్తం 9 రోజులు సెలవులు ఉంటాయి. జనవరి 19, 2026న తరగతులు తిరిగి ప్రారంభమవుతాయి. తెలంగాణలో ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరిస్తుందని భావిస్తున్నారు. త్వరలో అధికారిక సెలవు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. తెలంగాణకు జనవరి 10 నుండి జనవరి 15, 2026 వరకు పాఠశాలలకు సెలవులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యార్థులకు దాదాపు 6 రోజుల సెలవులు అందిస్తున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా ప్రకటించే సమయంలో ఏదైనా మార్పులు జరగవచ్చు. అవసరం అనుకుంటే సెలవులను పెంచవచ్చు.

ఇది కూడా చదవండి: Money Plant: ఈ సీజన్‌లో మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఇలా చేస్తే పచ్చగా

ఇవి కూడా చదవండి

ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు వర్తిస్తాయి. విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకునే అవకాశం కల్పిస్తుంది. అదనంగా పాఠశాలలు జనవరి 23న వసంత పంచమి/సరస్వతీ పూజ/సుభాష్ చంద్రబోస్ జయంతి, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవులు ప్రకటిస్తాయి. దీనితో నెల మధ్యలో మరిన్ని సెలవులు లభిస్తాయి. తెలుగు సంస్కృతిలో ఒక ముఖ్యమైన పండుగ అయిన సంక్రాంతి సూర్య భగవానునికి అంకితం చేయబడింది. అలాగే సూర్యుడు ఉత్తరార్థగోళం వైపు ప్రయాణానికి నాంది పలుకుతుంది. ఈ పండుగను నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. జనవరి 14న భోగి, జనవరి 15న సంక్రాంతి, జనవరి 16న కనుమ. జనవరి 17, 2026న ముక్కనుమ ఇలా వరుసగా పండగను ఆనందంగా జరుపుకొంటారు.

ఇది కూడా చదవండి: Auto News: ఫుల్‌ ట్యాంక్‌ చేస్తే 780 కి.మీ రేంజ్‌.. మార్కెట్‌ను షేక్‌ చేస్తున్న బైక్‌..!

ఇది కూడా చదవండి: Best Bikes: భారత్‌లో 5 చౌకైన బైక్‌లు ఇవే.. రూ. 55,000 నుండి ప్రారంభం!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి