Jaggareddy: అదిగో ఇదిగో అన్నారు.. ఇవాళే గుడ్‌బై చెప్పేస్తానన్నారు.. డెడ్‌లైన్‌ ముగిసే సరికి వెనక్కి తగ్గాడు.. జగ్గారెడ్డి రివర్స్ గేర్!

|

Feb 19, 2022 | 4:28 PM

సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి తీరుతో కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొంది. శ‌నివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారన్న వార్తలు వచ్చాయి. తాజాగా లేఖతో సరిపెట్టారు.

Jaggareddy: అదిగో ఇదిగో అన్నారు.. ఇవాళే గుడ్‌బై చెప్పేస్తానన్నారు.. డెడ్‌లైన్‌ ముగిసే సరికి వెనక్కి తగ్గాడు.. జగ్గారెడ్డి రివర్స్ గేర్!
Jaggareddy
Follow us on

Sangareddy MLA Jaggareddy: అదిగో ఇదిగో అన్నారు. ఇవాళే గుడ్‌బై చెప్పేస్తానన్నారు. టైం కూడా ఫిక్స్‌ చేశారు. డెడ్‌లైన్‌ ముగిసే సమయానికి కాస్త వెనక్కి తగ్గారు. ఇప్పుడు కాదు రెండు, మూడు రోజుల్లో నిర్ణయిస్తానని చెప్పుకొచ్చారు. పైగా పార్టీలో అవమానం జరుగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి, ముఖ్యనేత రాహుల్‌గాంధీకి లేఖలు రాశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి తీరుతో కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొంది. అది ఇప్పట్లో సద్దుమణిగే పరిస్థితి కనపించడం లేదు. గతకొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అవ‌మానానికి గుర‌వుతున్న జ‌గ్గారెడ్డి శ‌నివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారన్న వార్తలు వచ్చాయి. తాజాగా లేఖతో సరిపెట్టారు జగ్గారెడ్డి.

తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి టార్గెట్‌నే విమర్శలు, లేఖలు రాశారు జగ్గారెడ్డి. పార్టీలోకి సడన్‌గా వచ్చి లాబీయింగ్‌ చేస్తే ఎవరైనా పీసీసీ కావొచ్చన్నారు. అలాంటి తప్పు తాను చేయబోనన్నారు. తనపై కుట్ర పూరితంగానే కోవర్టు అన్న ఆరోపణలు చేస్తున్నారని, అయినా పార్టీ వ్యవస్థ వాటిని ఖండించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. ఆర్థిక కష్టాలు ఉన్నా పార్టీ కోసమే పని చేశానని సోనియా, రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆరోపణలు పడే కంటే స్వతంత్రంగా ఉండటం బెటరన్న నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భార్యనే నిలబెట్టానని, పోటీకి పెట్టని వారు కోవర్టులా? తాను కోవర్టునా అని లేఖలో ప్రశ్నించారు జగ్గారెడ్డి. రాహుల్‌ సభ కోసం కోట్లు ఖర్చు పెడితే కోవర్టు బిరుదు ఇస్తారా నిలదీశారు. తన పార్టీ పదవులకు రాజీనామా చేసి స్వతంత్రంగా ఉండాలని భావిస్తున్నానని, ఈ లేఖ విడుదల దగ్గరి నుంచి తాను కాంగ్రెస్‌ పార్టీ గుంపులో లేనని ప్రకటించారు. త్వరలో పదవులకు రాజీనామా చేస్తానని లేఖలో సోనియా, రాహుల్‌కు వివరించారు జగ్గారెడ్డి.

ఇదిలావుంటే, అంతకు ముందు జగ్గారెడ్డి ఇవాళే రాజీనామా చేస్తారన్న ప్రచారం కాంగ్రెస్‌లో కలకలం రేపింది. దాంతో పార్టీ సీనియర్‌ నేతలు ఆయనకు ఫోన్‌ చేసి బుజ్జగించారు. వీహెచ్‌ స్వయంగా జగ్గారెడ్డి దగ్గరకు వెళ్లి మాట్లాడారు. కొన్ని రోజులు ఆగాలని సూచించారు. ఇవాళే రాజీనామా చేస్తారని ముందు ప్రచారం జరిగినా సీనియర్ల ఒత్తిడితో కొంత వెనక్కి తగ్గారు జగ్గారెడ్డి.

అంతకు ముందు, రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానన్నారు. తన వల్లే పార్టీకి నష్టం వస్తుందంటే తానే పక్కకు తప్పుకుంటానన్నారు జగ్గారెడ్డి. తనను పక్కన పెట్టడమే కాంగ్రెస్‌ మంచిదన్నారు జగ్గారెడ్డి. తన వల్లే ఇబ్బంది కలుగుతున్నప్పుడు పక్కన పెట్టేయాలని విజ్ఞప్తి చేశారు. తాను కోవర్ట్‌ అని ప్రచారం జరిగినా కనీసం ఖండించకపోవడం బాధాకరమన్నారు. ఈ అంశంపై గాంధీభవన్‌లో యుద్ధాలే జరిగాయన్నారు జగ్గారెడ్డి. 2017లో రాహుల్ గాంధీ స‌భ పెట్టేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోతే.. కోట్ల రూపాయాలు ఖ‌ర్చు పెట్టి స‌భ నిర్వ‌హించాను అని జ‌గ్గారెడ్డి లేఖ‌లో గుర్తు చేశారు. ఆ సభ నుండి రాష్ట్రంలో పార్టీ బలపడింది.. పార్టీ కోసం కష్టపడిన నేనా కోవర్టుని… సభను నిర్వహించకుండా మౌనంగా ఉన్న నేతలా కోవర్టులు…? అని జ‌గ్గారెడ్డి ప్ర‌శ్నించారు.

హైప్‌ కోసమే ఇలాంటి చేస్తున్నారన్న ఇతర పార్టీల ప్రచారాన్ని జగ్గారెడ్డి ఖండించారు. రేవంత్‌రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు, మీడియా 10 గంటలు వెయిట్‌ చేస్తే హైప్‌ కోసమేనా అని ఎదురు ప్రశ్నించారు. మరోవైపు, రేవంత్‌ను బుజ్జగించేందుకు సీనియర్లు సీన్‌లోకి వచ్చారు. భట్టి విక్రమార్క ఆయనకు ఫోన్‌ చేసి మాట్లాడారు. కూర్చుని మాట్లాడుకుందామని, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.

జగ్గారెడ్డి లేఖ పూర్తి సారాంశం ఇక్కడ క్లిక్ చేయండి

Read Also….Harish Rao Letter: తెలంగాణ బకాయిల సంగతేంటి.. కేంద్రానికి మంత్రి హరీశ్ రావు మరోసారి లేఖ..!

Statue of Equality: ముచ్చింతల్ మరో మహాఅద్భుతం ఆవిష్కృతం.. దివ్యదేశాలు స్వర్ణభరితం!