Sridhar Rao Arrest: అమితాబ్‌ బచన్‌ బంధువులకే టోపీ.. సంధ్య కన్వెన్షన్‌ ఎండీ సంధ్య శ్రీధర్ మరోసారి అరెస్ట్..

|

Feb 20, 2023 | 8:26 AM

హైదరాబాదీ రియల్టర్ సంధ్యాశ్రీధర్ మామూలోడు కాదు. ఈసారి ఏకంగా అమితాబ్‌ బంధువులకూ కుచ్చుటోపీ పెట్టాడు. నేరుగా ఢిల్లీ పోలీసులకే చిక్కాడు. విచిత్రం ఏంటంటే.. ఈ అరెస్ట్ నాలుగోసారి. జైలుకెళ్లిరావడం అతనికి హాబీగా మారిపోయిందా అనేదే..

Sridhar Rao Arrest: అమితాబ్‌ బచన్‌ బంధువులకే టోపీ.. సంధ్య కన్వెన్షన్‌ ఎండీ సంధ్య శ్రీధర్ మరోసారి అరెస్ట్..
Sandhya Convention Md Sandhya Sridhar Rao
Follow us on

సంధ్య కన్వెన్షన్‌ ఎండీ సంధ్య శ్రీధర్‌రావు మరోసారి అరెస్ట్ చేశారు. మరోసారి ఎందుకు అంటున్నాం అంటే.. ఇలా అరెస్ట్ అవ్వడం ఆయనకు నాలుగోసారి.. మధ్యతరగతి నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరినైనా చీటింగ్ చెయ్యగలరా అనేస్థాయిలో ఆయన వ్యవహారం.. తాజాగా అమితాబ్‌ బచన్‌ బంధువులనూ మోసం చేసిన శ్రీధర్‌ మరోసారి పోలీసులకు చిక్కడారు. ట్రాక్టర్లు ఇప్పిస్తానని చెప్పి రూ. 250 కోట్ల మేర ముంచేసినట్లుగా పోలీసులకు అమితాబ్ బంధువులు ఫిర్యాదు చేశారు. అమితాబ్ బంధువుల ఫిర్యాదుతో సంధ్య శ్రీధర్‌ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.

ఇదిలావుంటే, గత ఏడాది గబ్చిబౌలిలో ఈవెంట్‌ మేనేజర్‌పై దాడి చేసిన శ్రీధర్‌రావు తెరపైకి రావడంతో బాధితులంతా పోలీస్‌స్టేషన్లకు క్యూ కడుతున్నారు. పుట్టలో నుంచి ఒక్కొక్కటిగా పాములు బయటికి వచ్చినట్టు.. శ్రీధర్‌రావు అరాచకాలన్నీ మళ్లీ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దాడి చేస్తున్న సీసీటీవీ దృశ్యాలు బయటికి రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు శ్రీధర్‌రావు .

ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీధర్‌రావుపై కంప్లైంట్స్‌ వెల్లువెత్తుతున్నాయి. ఆర్గానిక్‌ ఫుడ్‌ బిజినెస్‌ చేసుకుంటున్న తనను ఇబ్బంది పెడుతున్నాడంటూ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు ఖుషీచంద్‌. షాపును ఓపెన్‌ చేయనివ్వకుండా తన మనుషులతో దౌర్జన్యం చేస్తున్నాడని వాపోతున్నాడు.

కోర్టు ఆదేశాలను, పోలీసులను కూడా శ్రీధర్‌ లెక్క చేయడం లేదంటున్నాడు ఖుషీచంద్‌. ఒక్క చోట కాదు, ఒక్క కేసు కాదు, అనేక నేరాల్లో అరెస్టైన శ్రీధర్‌రావు బెయిల్‌పై బయట తిరుగుతున్నాడు. అయితే, అరెస్ట్ అవ్వడం, బెయిల్‌పై బయటికి రావడం… శ్రీధర్‌రావుకి అలవాటుగా మారిందంటున్నారు బాధితులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం