Sad Story Of Old Woman: మానవత్వమా నీ చిరునామా ఎక్కడ? పనికి రాదని కన్నతల్లిని ఇంట్లోనుంచి గెంటేసిన తనయుడు..

Sad Story Of Old Woman: ప్రపంచంలో ఇంకా కల్తీ కానిది.. లేనిది ఏమైనా ఉందంటే అది కన్నతల్లి ప్రేమ ఒక్కటే.. మాతృత్వంలోని ప్రేమకు ఎవరూ అతీతులు కారు. జంతువుల్లోఐనా... పక్షుల్లోఐనా..

Sad Story Of Old Woman: మానవత్వమా నీ చిరునామా ఎక్కడ? పనికి రాదని కన్నతల్లిని ఇంట్లోనుంచి గెంటేసిన తనయుడు..
Mother On The Road

Edited By:

Updated on: Jul 19, 2021 | 6:53 PM

Viral Photo: ప్రపంచంలో ఇంకా కల్తీ కానిది.. లేనిది ఏమైనా ఉందంటే అది కన్నతల్లి ప్రేమ ఒక్కటే.. మాతృత్వంలోని ప్రేమకు ఎవరూ అతీతులు కారు. జంతువుల్లోఐనా… పక్షుల్లోఐనా… మనుషుల్లోఐనా తల్లి పంచె ప్రేమలో మాత్రం భేదం ఉండదు. ఈ సృష్టిలో తల్లి ప్రేమకు సాటి వచ్చేది ఏదీ లేదని..అమ్మ కోసం తపించే వారు ఎందరో.. అయితే కొంతమంది తనయులు మాత్రం.. ఇందుకు అతీతం.. మానవ సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలే ని నిరూపిస్తున్నారు. భర్త భర్తల సంబంధం కడుపున పుట్టిన పిల్లలలు ఇవేమీ మనిషి జీవితంలో చివరి వరకూ తోడురావని నిరూపిస్తున్నారు కొంతమంది ఘనులు. బతికుండగానే కన్నవారిని నడిరోడ్డు పాలు చేస్తున్నారు. . మానవత్వమా నీ చిరునామా ఎక్కడ అని మనల్ని మనమే ప్రశ్నించుకునే ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

పశుపక్షాదుల ప్రేమను చూసి.. వీడియో షేర్ చేసే మనం వాటినుంచి ఏమీ నేర్చుకోవడం లేదు..సరికదా రోజు రోజుకీ మరింతగా దిగజారిపోతున్నాం.. అనే విధంగా మంచిర్యాల జిల్లాలోని హమాలివాడలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. నవమాసాలు మోసి, పెంచి పెద్దచేసిన కన్నతల్లిని ఇద్దరు కొడుకులు బరువు అనుకున్నారు. హమాలివాడలో సుభద్ర అనే వృద్ధురాలు నివాసం ఉంటుంది. సుభద్రకు మహేష్, సురేష్ అనే ఇద్దరు కుమారులున్నారు.

వృద్ధురాలు కావడంతో కొడుకులిద్దరూ తల్లిని చెరొక నెల చూసేలా పంచుకున్నారు. ఈ నెల సుభద్రను చూసే వంతు పెద్ద కొడుకు మహేష్ కు వచ్చింది. అయితే తన తల్లి పని చేయలేదు.. డబ్బులు లేవు.. ఏమీ ఉపయోగం లేదని ఆలోచించాడు.. తల్లి భారం అనిపించి ఇంట్లోంచి గెంటేశాడు.

దీంతో సుభద్రకు ఎటు వెళ్లాలో దిక్కుతోచక పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంది. అక్కడ మెట్లపై ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. అది చూసిన స్థానికులు సాయం అందించారు.. వృద్ధాప్యంలో తల్లిని గెంటేసిన కొడుకు బుద్ధి చెప్పాలని.. ఆ వృద్దురాలికి సరైన ఆధారం కల్పించాలని డిమాండ్ చేశారు.

Also Read: Cadbury Dairy Milk: కొత్త వివాదంలో క్యాడ్‌బరీ చాక్లెట్స్ .. బ్యాన్ చేయాలంటూ నెటిజన్లు రచ్చ రచ్చ