Rythu Bharosa: రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. వారి అకౌంట్లోకి కూడా డబ్బులు వచ్చేశాయి..

తెలంగాణ రైతులకు సూపర్ న్యూస్. రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం ఆరు ఎకరాల వరకు భూమి ఉన్నవారికి నిధులు జమ చేసింది. ఎకరానికి రూ.6 వేల చొప్పున విడుదల చేసింది. మిగతవారికి త్వరలోనే వేయనుందని తెలుస్తోంది.

Rythu Bharosa: రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. వారి అకౌంట్లోకి కూడా డబ్బులు వచ్చేశాయి..
Rythu Bharosa

Updated on: Jul 04, 2026 | 5:17 PM

రైతు భరోసా లబ్దిదారులకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. శనివారం ఐడో విడత నిధులను రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా ఆరు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం విడుదల చేసింది. దాదాపు 1.69 లక్షల మంది బ్యాంక్ ఖాతాల్లో రూ.7,135 కోట్లు జమ చేసింది. జూన్ 30 నుంచి విడతల వారీగా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. తొలి రోజు రెండు ఎకరాల వరకు సాగు భూమి ఉన్నవారికి జమ చేసింది. అనంతరం మూడు ఎకరాలు, నాలుగు ఎకరాలు ఉన్నవారికి వేయగా.. శుక్రవారం ఐదు ఎకరాలవరకు ఉన్నవారికి అందించింది.

ఆరు ఎకరాలు ఉన్నవారికి జమ

వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. వర్షాలు ఇప్పుడిప్పుడే మొదలుకావడంతో రైతులు పంట సాగుకు సిద్దమవుతున్నారు. దీంతో పెట్టుబడి సాయం వీటిని విడుదల చేస్తోంది. దీంతో రైతులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ పంటకు పెట్టుబడి కోసం ఇవి ఉపయోగపడతాయని చెబుతున్నారు. రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించి వారికి సహాయపడలానే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింపచేస్తోంది. ఇప్పటివరకు ఆరు ఎకరాల వరకు స్థలం ఉన్నవారికి పూర్తి చేయగా.. మిగతా రైతులకు కూడా త్వరలో జమ చేయనుంది. తొమ్మిది రోజుల్లో రైతులందరికీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పధకం ద్వారా మొత్తం 73 లక్షల మంది రైతులకు రూ.9 వేల కోట్లు అందించనుంది.

డబ్బులు అందకపోతే ఏం చేయాలి..?

రైతు భరోసా డబ్బులు అందనివారు బ్యాంక్‌కు వెళ్లి అకౌంట్ వివరాలు చెక్ చేసుకోవాలి. ఈకేవైసీ పూర్తయిందో.. లేదో చూడాలి. ఇక ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అన్నీ కరెక్ట్‌గా ఉన్నా అందకపోతే మీ మండల పరిధిలోని అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ అధికారిని సంప్రదించాలి. అధికారులు పరిశీలించి మీకు రైతు భరోసా ఎందుకు రాలేదనేది చెబుతారు. ఆ సమస్యను క్లియర్ చేసుకుంటే మీకు నిధులు అందుతాయి. జులై 10వ తేదీల్లో అందరి అకౌంట్లలో నగదు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో త్వరలో మీ ప్రాబ్లం క్లియర్ చేసుకుంటే డబ్బులు అందే అవకాశం ఉంటుంది. ఇక జూన్ 15 నాటికి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పొందినవారు జులై 5లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఏఈవో ఆఫీసర్‌ను కలిపి దరఖాస్తు సమర్పించి డాక్యుమెంట్స్ సమర్పించాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us