Rythu Bandhu: తెలంగాణ రైతులకు ముఖ్య గమనిక.. ‘రైతుబంధు’ పథకం సొమ్మును ఇలా కూడా తీసుకోవచ్చు..

|

Dec 27, 2020 | 6:23 AM

తెలంగాణ రైతాంగానికి పోస్టల్ బ్యాంకు అధికారులు శుభవార్త తెలిపారు. ఇక నుంచి రైతుబంధు కింద ఖాతాల్లో జమ అయ్యే డబ్బును పోస్టల్ మైక్రో...

Rythu Bandhu: తెలంగాణ రైతులకు ముఖ్య గమనిక.. ‘రైతుబంధు’ పథకం సొమ్మును ఇలా కూడా తీసుకోవచ్చు..
Follow us on

Rythu Bandhu: తెలంగాణ రైతాంగానికి పోస్టల్ బ్యాంకు అధికారులు శుభవార్త తెలిపారు. ఇక నుంచి రైతుబంధు కింద ఖాతాల్లో జమ అయ్యే డబ్బును పోస్టల్ మైక్రో ఏటీఎంల ద్వారా కూడా తీసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ పీవీఎస్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 4,860 పోస్టాఫీసుల వద్ద మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేశామన్నారు. ఆధార్‌ అనుసంధానంతో బ్యాంకు ఖాతాలున్నవారందరూ పోస్టల్‌ ఏటీఎం ద్వారా నగదు పొందవచ్చని ఆయన చెప్పారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఏటా రెండు దఫాలుగా రైతుబంధు కింద కొంత నగదు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే చాలా మంది రైతులకు పోస్టల్ బ్యాంకు ఖాతాలు ఉండటంతో సంబంధిత నగదు ఆ ఖాతాల్లోనే జమ అవుతోంది. ఇక అన్ని పోస్టల్ బ్యాంక్ కేంద్రాల్లో ఏటీఎంలు అందుబాటులో లేకపోవడంతో రైతులు పోస్టల్ బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున క్యూ కట్టాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పోస్టాఫీసుల వద్ద మెక్రో ఏటీఎంలు ఏర్పాటు చేయడం శుభపరిణామం అనే చెప్పాలి.

 

Also read:

Telangana Govt: ఆ విషయంలో తెలంగాణ సూపర్ అంటూ యూపీ ఛానల్ ఎడిటర్ ట్వీట్.. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ కవిత..

ASHOK VS MEESALA GEETHA: మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు షాకిచ్చిన టీడీపీ అధిష్టానం.. సర్క్యూలర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన గీత..