Telangana Govt: ఆ విషయంలో తెలంగాణ సూపర్ అంటూ యూపీ ఛానల్ ఎడిటర్ ట్వీట్.. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ కవిత..

తెలంగాణ ప్రభుత్వంపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఛానల్ ఎడిటర్ బ్రిజేష్ మిశ్రా ప్రశంసల జల్లు కురిపించారు. రైతాంగం అభివృద్ధికై తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt: ఆ విషయంలో తెలంగాణ సూపర్ అంటూ యూపీ ఛానల్ ఎడిటర్ ట్వీట్.. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ కవిత..
Follow us

|

Updated on: Dec 27, 2020 | 5:20 AM

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వంపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఛానల్ ఎడిటర్ బ్రిజేష్ మిశ్రా ప్రశంసల జల్లు కురిపించారు. రైతాంగం అభివృద్ధికై తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానలను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటున్న విధానం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శనంగా నిలుస్తోందన్నారు. ఆ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అంతేకాదు.. తెలంగాణలో ధాన్యాన్ని రైతుల వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తున్నారని, క్వింటాల్‌కు రూ. 1888 మద్దతు ధర కల్పిస్తుందంటూ కితాబిచ్చారు. ఇక ఆ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం కేవలం 8 రోజుల్లోనే రైతులకు చెల్లిస్తోందని బ్రిజేష్ మిశ్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదిలాఉండగా, బ్రిజేష్ మిశ్రా ట్వీట్‌కు ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రైతుల దగ్గరికే వెళ్లి పూర్తి పంట కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం అంటూ రీట్వీట్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రైతుల అభ్యున్నతి మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం.. వారి బాగోగుల కోసం సీఎం దృఢ నిశ్చయంతో పని చేస్తున్నారు.. రైతులు నుంచి పూర్తి ధాన్యం కొన్న రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం తెలంగాణ మాత్రమే’ అంటూ కవిత ‌ట్వీట్ చేశారు.

Also read:

ఆదిలాబాద్​ కాల్పుల ఘటనలో గాయపడిన జమీర్ మృతి..ప్రశాంతంగా ముగిసిన అంత్యక్రియలు

Farmers Protest: కాంగ్రెస్ నేతల ధర్నాకు కారణం అదే.. రాహుల్ గాంధీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్..