Rain Effect: పొలిటికల్ పార్టీలను భయపెట్టిస్తున్న ప్రకృతి.. మూడు సభల పై ప్రభావం..!

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ర్యాలీలు, రోడ్‌షోలతో జనంలోకి వెళ్ళాలనుకున్న పొలిటికల్ పార్టీలకు ప్రక‌ృతి వెంటాడుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు స్టార్ క్యాంపెనర్ల టూర్లతో షెడ్యూల్ తయారు చేసుకుని.. జన సమీకరణలో బిజీబిజీగా గడుపుతున్న ఆయా పార్టీల నాయకులకు ప్రకృతి సహకరించడం లేదు.

Rain Effect: పొలిటికల్ పార్టీలను భయపెట్టిస్తున్న ప్రకృతి.. మూడు సభల పై ప్రభావం..!
Heavy Rain
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 07, 2024 | 9:17 PM

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ర్యాలీలు, రోడ్‌షోలతో జనంలోకి వెళ్ళాలనుకున్న పొలిటికల్ పార్టీలకు ప్రక‌ృతి వెంటాడుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు స్టార్ క్యాంపెనర్ల టూర్లతో షెడ్యూల్ తయారు చేసుకుని.. జన సమీకరణలో బిజీబిజీగా గడుపుతున్న ఆయా పార్టీల నాయకులకు ప్రకృతి సహకరించడం లేదు. ఇప్పటి వరకు పగటి పూట ప్రచారానికి మండుతున్న ఎండలు భయపెట్టగా, తాజాగా ఒక్కసారిగా వాతావరణం మారడంతో అకాల వర్షం కూడా వారిని ఇబ్బందుల పాలు చేస్తోంది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించాల్సిన వీఐపీల ప్రచార సభలు రద్దు కావడమో లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవల్సిన పరిస్థితి తయారైంది.

మండుతున్న ఎండల కారణంగా రాజకీయ పార్టీల నాయకులు పట్ట పగలు ప్రచారం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఏప్రిల్ నెలలోనే ఎండల ప్రభావం 103 ఏళ్ల ఆల్ టైం రికార్డ్ ను బ్రేక్ అయింది. ఏప్రిల్ నెలలో 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవడం వందేళ్లల్లో ఇదే తొలిసారి కావడంతో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఉదయం, సాయంత్రం చేస్తున్నారు నేతలు. ఆయా పార్టీల నాయకులు 11 గంటల్లో గానే ప్రచారాన్ని ముగించుకుని, సాయంత్రం 5 గంటల తరువాత తిరిగి నిర్వహిస్తున్నారు.

కరీంనగర్ సీఎం టూర్…

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార సభ నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు కరీంనగర్ ఎస్సారార్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు సీఎం హాజరై వెలిచాల రాజేందర్ రావు గెలుపు కోసం ప్రసంగించాల్సి ఉంది. ఇందు కోసం కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుండి భారీగా జనసమీకరణ కూడా చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు వరుణుని రూపంలో ఆటంకం ఏర్పడింది. మద్యాహ్నం 3.30 గంటల నుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోగా, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన టెంట్లు, షామియానాలు కుప్పకూలిపోయాయి. ప్రతికూల వాతావరణంలో సీఎం వరంగల్, కరీంనగర్ సభలకు హాజరయ్యే పరిస్థితి లేకుండా పోయింది. హెలికాప్టర్‌లో ప్రయాణించే పరిస్థితి లేకపోవడంతో రేవంత్ రెడ్డి రోడ్డు మార్గం గుండా వరంగల్ కు వెళ్ళి అక్కడ రోడ్ షో నిర్వహించాలని నిర్ణయించారు. కరీంనగర్ లో నిర్వహించాల్సిన జన జాతర సభను రద్దు చేసుకున్నారు.

మంథనిలో బీజేపీ సభ…

పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ విజయం కోసం రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ పర్యటన ఖరారైంది. అయితే రాజప్థాన్ సీఎం మంథనిలో క్యాంపెయిన్ నిర్వహించేందుకు ఆలస్యంగా చేరుకున్నారు. ఒక్కసారిగా ఈదురు గాలులు, వర్షం అందుకోవడంతో సభావేదిక వద్దకు వచ్చిన జనం అంతా సభాస్థలి నుండి వెళ్ళిపోయారు. సీఎం టూర్ నేపథ్యంలో భారీగా జనసమీకరణ చేపట్టినప్పటికీ చివరి నిమిషంలో వాతావరణం అనుకూలించకపోవడంతో బీజేపీ పార్టీ శ్రేణులను నిరుత్సాహపరిచింది. వేదిక ప్రాంతంలో ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్లు చెల్లాచెదురు కావడంతో సభ నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో సీఎం భజన్ లాల్ శర్మ సభా స్థలి వద్దకు చేరుకుని ప్రచార రథంపై నుండి తన ప్రసంగాన్ని కొనసాగించారు.

మోదీ సభ ఏర్పాట్లకు అంతరాయం

అటు వేములవాడలోనూ భారీ వర్షం కురిసింది. ప్రధాని మోదీ మే8వ తేదీన ఉదయం వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని అక్కడ జరిగే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే మోదీ సభ కోసం చేస్తున్న ఏర్పాట్లకు అకాల వర్షంతో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి సభాప్రాంగణం బురదమయంగా మారింది. ఓ వైపు మోదీ పర్యటన మరో వైపు అకాల వర్షంతో బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

ఇదిలావుంటే, రికార్డ్ స్థాయి ఎండలతో తల్లడిల్లిన జనానికి మాత్రం అకాల వర్షం ఉపశమనం కలిగించింది. వారం పదిరోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం చల్లని వాతావరణంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
ఆ జిల్లా పోలీసులపై సస్పెన్షన్ వేటు.. కౌంటింగ్ కేంద్రాలపై నిఘా..
ఆ జిల్లా పోలీసులపై సస్పెన్షన్ వేటు.. కౌంటింగ్ కేంద్రాలపై నిఘా..
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!
ఆరోగ్య బీమా ఎంత ఉండాలి? ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ అంటే ఏంటి?
ఆరోగ్య బీమా ఎంత ఉండాలి? ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ అంటే ఏంటి?
పైసల కోసం ప్రియురాలి దిమ్మతిరిగే స్కెచ్‌..! లక్షల సొమ్ముతో పరార్
పైసల కోసం ప్రియురాలి దిమ్మతిరిగే స్కెచ్‌..! లక్షల సొమ్ముతో పరార్
హైదరబాద్ ప్లేస్ ఎక్కడ? డిసైడ్ చేయనున్న పంజాబ్..
హైదరబాద్ ప్లేస్ ఎక్కడ? డిసైడ్ చేయనున్న పంజాబ్..
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..
నెలకు రూ.500 డిపాజిట్‌తో చేతికి రూ.4 లక్షలు.. బెస్ట్‌ స్కీమ్స్
నెలకు రూ.500 డిపాజిట్‌తో చేతికి రూ.4 లక్షలు.. బెస్ట్‌ స్కీమ్స్
ఆ ప్రాజెక్టులపై చేపట్టాల్సిన చర్యలు.. ప్రత్యమ్నాయాలపై చర్చలు..
ఆ ప్రాజెక్టులపై చేపట్టాల్సిన చర్యలు.. ప్రత్యమ్నాయాలపై చర్చలు..