Telangana: ‘సైబర్‌ పాఠాలు బోధిస్తున్న గణేశుడు’.. ప్రశంసల జల్లు కురిపించిన సజ్జనార్‌

|

Sep 10, 2024 | 5:12 PM

దీంతో పోలీసులు ప్రత్యేకంగా సైబర్‌ వింగ్ ఏర్పాటు చేసి మరీ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయి.? వీటి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలను అందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతోన్న వినాయక చవితి ఉత్సవాలను సైబర్‌ నేరాలకు అవగాహన కల్పించేందుకు ఉపయోగించుకున్నారు యువ కిరణం స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు...

Telangana: సైబర్‌ పాఠాలు బోధిస్తున్న గణేశుడు.. ప్రశంసల జల్లు కురిపించిన సజ్జనార్‌
Sajjanar
Follow us on

మారిన టెక్నాలజీతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది. ఒకప్పుడు దొంగలు భౌతికంగా దాడులు చేసి డబ్బులు కాజేసేవారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడో కూర్చొని మన ఖాతాలో డబ్బులు కాజేస్తున్నారు. ప్రజల అత్యాశను తమకు అనుకులంగా మార్చుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో సైబర్ మోసాలపై సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేవలం పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాల్లో కూడా సైబర్‌ మోసాల బారిన పడుతున్నారు.

దీంతో పోలీసులు ప్రత్యేకంగా సైబర్‌ వింగ్ ఏర్పాటు చేసి మరీ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయి.? వీటి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలను అందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతోన్న వినాయక చవితి ఉత్సవాలను సైబర్‌ నేరాలకు అవగాహన కల్పించేందుకు ఉపయోగించుకున్నారు యువ కిరణం స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు. సైబర్‌ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా మండపాన్ని ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. వినాయక మండపం డెకరేషన్ లో భాగంగా ఫ్లెక్సీపై సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధించిన వివరాలను ఫొటోలో రూపంలో ప్రచురించారు.

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఇందుకు సంబంధించి ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేస్తూ.. ‘సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ వినూత్న ఆలోచనతో యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. భక్తి భావంతో పాటు సమాజం హితం ఎంతో ముఖ్యమని ఈ అసోసియేషన్ గుర్తించడం గొప్ప విషయం. సైబర్ నేరాలు రోజురోజుకీ పెట్రేగిపోతున్నాయి. అమాయకులను మాయమాటలతో మోసగాళ్ళు కోట్లల్లో కుచ్చుటోపి పెడుతున్నారు. సమాజం పట్ల బాధ్యతతో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అంటూ రాసుకొచ్చారు.

సజ్జనార్ ట్వీట్..

దీంతో ప్రస్తుతం ఈ మండపానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న సైబర్‌ నేరాలకు సంబంధించి అవగాహన కల్పించేందుకు యువ కిరణం అసోసియేసన్‌ సభ్యులు చేసిన ఆలోచన భలే ఉందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..