Covid Vaccine: ఆర్టీసీ సిబ్బంది, కూరగాయల వ్యాపారులకు వ్యాక్సిన్.. స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశం

|

May 22, 2021 | 3:53 PM

కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు.. రోజు రోజుకు మరింత వేగంగా పెరుగుతున్నాయి. టెస్టుల సంఖ్య పెంచుతున్న ప్రభుత్వం నియంత్రణ చర్యలు కూడా వేగవంతం చేస్తోంది.

Covid Vaccine: ఆర్టీసీ సిబ్బంది, కూరగాయల వ్యాపారులకు వ్యాక్సిన్.. స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశం
CM KCR
Follow us on

Corona Vaccine drive for RTC Drivers: కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు.. రోజు రోజుకు మరింత వేగంగా పెరుగుతున్నాయి. టెస్టుల సంఖ్య పెంచుతున్న ప్రభుత్వం నియంత్రణ చర్యలు కూడా వేగవంతం చేస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఇదే క్రమంలో ముందు సూపర్ స్పైడర్స్‌‌గా ఉన్నవారికి కరోనా టీకా అందించాలని అధికారులకు సూచించారు.

ఇదే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సూపర్‌ స్పైడర్స్‌‌గా ఉన్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, కూరగాయల వ్యాపారులు, డెలివరీ బాయ్స్, సేల్స్‌మెన్‌ను గుర్తించి, జాబితాను రూపొందించాలని అయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వీరందరికీ టీకాలు వేసేందుకు స్పెషల్‌డ్రైవ్‌ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ వరంగల్‌ కలెక్టర్‌ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు చేపట్టాల్సి వివిధ కార్యక్రమాలపై జల్లా కలెక్టర్లకు సూచనలు చేశారు. అలాగే, కోవిడ్‌ దవాఖానల్లో సేవలందిస్తున్న అన్నిరకాల ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. వైద్య సిబ్బంది ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.

ఇదిలావుంటే, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూలు తదితర జిల్లాల్లో కోవిడ్‌ కేసుల సంఖ్య తగ్గకపోవడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ జిల్లాలకు స్వయంగా వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇతర రాష్ర్టాల సరిహద్దుల్లో ఉన్న జిల్లాల కలెక్టర్లు కరోనా కట్టడి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కరోనా క్లిష్ట సమయంలో దవాఖానల్లో పనిచేస్తున్న యావత్‌ సిబ్బందికి సీఎం కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

Read Also…  విద్యుత్ సిబ్బందిని చితకబాదిన పోలీసులపై చర్యలు తీసుకోండి… డీజీపీని ఆదేశించిన మంత్రి