Telangana: కారు ఆపి షాప్‌లోకి వెళ్లిన వ్యక్తి.. అనుమానస్పదంగా కనిపించిన బురఖా మహిళ.. ఆ తర్వాత.!

ఓ వ్యక్తి తన దుకాణానికి కారులో వెళ్లాడు. అతడి కారు డిక్కీలో డబ్బులు పెట్టాడు. తీరా పని ముగించుకుని కారు డిక్కీ ఓపెన్ చేయగానే.. దెబ్బకు షాక్ అయ్యాడు. పెట్టిన డబ్బులు లేవు.. ఎవరు పట్టుకుని వెళ్ళారో అని చూడగా.. దెబ్బకు షాక్..

Telangana: కారు ఆపి షాప్‌లోకి వెళ్లిన వ్యక్తి.. అనుమానస్పదంగా కనిపించిన బురఖా మహిళ.. ఆ తర్వాత.!
Representative Image

Edited By: Ravi Kiran

Updated on: Jul 01, 2025 | 9:51 PM

హైదరాబాద్‌లోని మలక్‌పేట్ గంజ్ ప్రాంతంలో ఒక వ్యాపారి ద్విచక్ర వాహన డిక్కీ నుంచి భారీ మొత్తంలో నగదు చోరీకి గురైన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ చోరీ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక వ్యాపారవేత్త షేక్ ఖుద్దూస్ ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో తన నివాసంలోని ద్విచక్ర వాహనం డిక్కీలో రూ.6,50,000 నగదు ఉన్న బ్యాగ్‌ను ఉంచినట్లు తెలిపారు. తన నిత్య కార్యకలాపాల్లో భాగంగా మలక్‌పేట్ గంజ్ ప్రాంతంలో ఉన్న తన దుకాణానికి వెళ్లిన ఆయన తిరిగి వచ్చినప్పుడు డిక్కీలో పెట్టిన బ్యాగ్ కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యాడు. డిక్కీ నుంచి బ్యాగ్ గల్లంతైనట్లు గమనించిన ఆయన వెంటనే చాదర్‌ఘాట్ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో అనుమానితురాలిగా బుర్ఖా ధరించిన గుర్తుతెలియని మహిళపై వ్యాపారి అనుమానం వ్యక్తం చేశారు. బ్యాగ్ చోరీకి ఆమెకు సంబంధం ఉండవచ్చని ఆయన పోలీసులకు చెప్పారు.

పోలీసులు అతని ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. దొంగతనం జరిగిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, అనుమానాస్పద కదలికలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే ఆ సమయంలో అక్కడున్న స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు దొంగతనం చేసిన వ్యక్తి ఎవరో ఖచ్చితంగా గుర్తించలేకపోయినా, సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ఈ ఘటనతో మలక్‌పేట్ గంజ్ ప్రాంతంలోని వ్యాపారవర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో వాహనాలలో పెద్ద మొత్తంలో నగదు ఉంచడం ప్రమాదకరమని, ఇటువంటి చర్యలు దొంగలకు అవకాశమిస్తాయని పలువురు వ్యాపారులు పేర్కొన్నారు.

పోలీసులు కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ, ప్రజలు పెద్ద మొత్తంలో నగదును సురక్షితంగా బ్యాంకుల ద్వారా తరలించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు గస్తీ పెంచాలని, సీసీటీవీ వ్యవస్థలను మరింత పటిష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. వ్యాపారులు భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, నగదు నిల్వలకు సంబంధించి కనీస జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు. పోలీసులు ప్రాధమికంగా ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి