Huge Fine: అడ్డుగా ఉందని తొలగించాడు.. ఆఖరికి భారీ జరిమానా కట్టాడు.. ఇంటి ఓనర్‌కు ఝలక్ ఇచ్చిన అధికారులు..

Huge Fine: ఇంటి నిర్మాణం కోసం చెట్టును నరికించిన వ్యక్తికి అధికారులు ఝలక్ ఇచ్చారు. చెట్టును నరికినందుకు ప్రతిగా రూ. 10 వేలు..

Huge Fine: అడ్డుగా ఉందని తొలగించాడు.. ఆఖరికి భారీ జరిమానా కట్టాడు.. ఇంటి ఓనర్‌కు ఝలక్ ఇచ్చిన అధికారులు..

Updated on: Jan 02, 2021 | 9:56 PM

Huge Fine: ఇంటి నిర్మాణం కోసం చెట్టును నరికించిన వ్యక్తికి అధికారులు ఝలక్ ఇచ్చారు. చెట్టును నరికినందుకు ప్రతిగా రూ. 10 వేలు జరిమానా విధించారు. వివరాల్లోకెళితే.. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నపైూర్ గ్రామం అల్కాపూర్ కాలనీ రోడ్డు నెంబర్ 8లో ఇనాతుల్లా ఖాన్ కుటుంబ నివాసముంటోంది. అయితే ఇంటి నిర్మాణంలో భాగంగా 15 సంవత్సరాల వయస్సు ఉన్న చెట్టును ఇనాతుల్లా నరికించాడు. దాంతో స్థానికులు ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన మణికొండ మున్సిపాలిటీ మేనేజర్ పవన్ కుమార్.. చెట్టును పరిశీలించి ఇంటి యజమాని ఇనాతుల్లా ఖాన్‌కు రూ. 10వేల జరిమానా విధించారు. ఇక నుంచి ఎవరైనా చెట్లను నరకాలంటే మణికొండ మున్సిపాలిటీ అధికారులకు తెలియజేయాలని పవన్ కుమార్ స్పష్టం చేశారు. ఒకవేళ చెట్లను తొలగించాలనుకుంటే ట్రాన్స్ లొకేషన్ పద్ధతిలో చెట్టును తొలగించవచ్చునని పేర్కొన్నారు. దీని ద్వారా చెట్టును సజీవంగా వేరే చోట నాటవచ్చునని, తక్కువ ఖర్చుతోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. కాదని ఎవరైనా చెట్లను నిరికివేస్తే రూ. 10వేలు అపరాధ రుసుము కింద జరిమానా వేస్తామని పవన్ కుమార్ హెచ్చరించారు.

 

Also read:

తాడిపత్రి ఘటనలపై ఎట్టకేలకు స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి, తానూ ఆమరణదీక్షకు కూర్చుంటానని ప్రకటన

TS RTC Special buses: సంక్రాంతి పండగకు హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు 4,980 ప్రత్యేక బస్సులు