Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట.. మధ్యంతర బెయిల్ నిరాకరణ

|

Apr 08, 2024 | 11:38 AM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సోమవారం కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీలో రౌస్‌ అవెన్యూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బెయిల్ పిటీషన్ ను నిరాకరించింది. చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో కవిత బెయిల్‌ కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు.

Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట.. మధ్యంతర బెయిల్ నిరాకరణ
MLC Kavitha
Follow us on

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సోమవారం కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీలో రౌస్‌ అవెన్యూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బెయిల్ పిటీషన్ ను నిరాకరించింది. చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో కవిత బెయిల్‌ కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. కవిత తరపున అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టును కోరిన ఈడీ.. బెయిల్‌ ఇస్తే సాక్షాలను ప్రభావితం చేస్తారంటూ వాదనలు వినిపించింది.అప్రూవర్‌ను కవిత బెదిరించారంటూ జడ్జికి కీలక ఆధారాలు సమర్పించింది. ఈ క్రమంలో కోర్టు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ ను తోసిపుచ్చింది. కాగా.. అరెస్టు అనంతరం కవిత మార్చి 26 నుంచి తిహార్‌ జైల్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇదిలాఉంటే.. రేపటితో కవిత జ్యూడిషియల్ రిమాండ్ ముగియనుంది.

వీడియో చూడండి..

అంతకుముందు..

ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీలో రౌస్‌ అవెన్యూ కోర్టులో ఈ నెల 4న వాడీవేడీగా వాదనలు జరిగాయి. కవిత తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ.. ఈడీ తరపున జోయబ్ హుసేన్ వాదనలు వినిపించారు. కుమారుడి పరీక్షల కారణంగా కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని రెండో పిటిషన్‌పై న్యాయస్థానం విచారించింది. కవిత కొడుక్కి పరీక్షలు ఉన్నాయని, అందుకే బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు అభిషేక్‌ సింఘ్వీ. అయితే కవిత రెగ్యులర్‌ బెయిల్‌పై వాదనలను ఏప్రిల్‌ 20కు వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్‌ కేసులో ప్రధాన సూత్రధారి ఎమ్మెల్సీ కవిత అని ఆరోపించారు ఈడీ తరపు న్యాయవాది. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదన్నారు. ఒకవేళ బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు వివరించారు. లిక్కర్ స్కామ్‌ను ప్లాన్ చేసిందే కవిత అని.. ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించారు. గతంలో విచారించిన సమయంలో మొత్తం 10 ఫోన్లను కవిత ఇచ్చారని.. కానీ అవి మొత్తం ఫార్మాట్ చేసినవేనని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నోటీసులు ఇచ్చిన తరువాత 4 ఫోన్లను ఫార్మాట్ చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను బయటకు చూపించలేమంటూ.. జడ్జి కావేరి బవేజాకు నేరుగా తీసుకెళ్ళి చూపించారు ED జేడీ భానుప్రియ మీనా. పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ అడుగుతున్నారు.. కానీ ఇప్పటికే కొన్ని పరీక్షలు అయిపోయాయని కోర్టుకు వివరించింది ఈడీ.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో కవితను విచారించారు. ప్రస్తుతం కవిత తిహార్‌ జైల్లో ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..